బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యై ఓల్టేజ్ యాక్షన్ మూవీ వార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా డబ్ అయ్యి రిలీజ్ కానుంది. కాగా సినిమా కి నార్త్ సైడ్ లో సైరా ని పోటి ఎంత ఉంటుంది అన్నది….
ప్రస్తుతానికి చెప్పలేం కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే సౌత్ లో మాత్రం పోటి ఓ రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి.. అయినా కానీ సినిమా ఇక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది. నైజాం లో 80 వరకు థియేటర్స్ లో….
150 వరకు స్క్రీన్స్ లో ఆంద్రలో టోటల్ గా 140 వరకు థియేటర్స్ అండ్ 200 కి పైగా స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కానుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 220 వరకు థియేటర్స్ లో 350 స్క్రీన్స్ లో వార్ సినిమా తెలుగు అండ్ హిందీ కలిపి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా హిందీ మరియు తెలుగు కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ 2.6 కోట్లు పలికింది. అంత పోటిలో ఓ హిందీ మూవీ కి ఇక్కడ ఈ రేంజ్ లో రేటు పలకడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే… బాక్స్ ఆఫీస్ దగ్గర…
రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమం 3.2 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అంటే 5 కోట్ల వరకు గ్రాస్ ని సినిమా ఇక్కడ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఇండియా లో సినిమా టోటల్ బిజినెస్ 110 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి 210 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సినిమా అందుకోవాల్సి ఉంటుంది.