మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో దూసుకు పోతుంది, సినిమా 4 సినిమాల మధ్య పోటి లో రిలీజ్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో క్లాస్ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మాస్ సెంటర్స్ లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది, ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో మల్టీ ప్లేక్సులలో జోరు చూపింది.
భారీ గ్రోత్ తో దూసుకు పోయిన ఈ సినిమా మాస్ సెంటర్స్ లో కూడా జోరు చూపినా అక్కడ ఎక్కువగా రూలర్ సినిమా జోరు చూపడంతో అనుకున్న రేంజ్ లో పుంజుకోలేదు. అయినా కానీ ఓవరాల్ గా మొదటి రోజు ఓవరాల్ ఆక్యుపెన్సీ 55% కి పైగానే ఉందని చెప్పొచ్చు.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3.3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు ఉంటె ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 4.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకోవచ్చు. మొత్తం మీద భారీ పోటి లో ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.