ఇతర ఇండస్ట్రీ ల హీరోలు మన టాలీవుడ్ లో మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసుకోవడం లో చాలా ముందు ఉన్నారు, మన వాళ్ళు కూడా అన్ని సినిమాలు చూస్తారు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే చాలు, మన హీరోలు పక్క ఇండస్ట్రీ హీరోలు లాంటివి పట్టించుకోనుండా ఎగబడి థియేటర్స్ కి వెళతారు. కానీ ఇతర ఇండస్ట్రీ ల ఆడియన్స్ మరీ మనలా థియేటర్స్ కి విరగబడి వెళ్ళే టైప్ కాదు… ఏ బాహుబలి లాంటి సినిమా కి తప్పితే…
మిగిలిన సినిమాలను చాలా వరకు లైట్ తీసుకుంటారు. అయినా మన హీరోలు కొందరు పాన్ ఇండియా మూవీస్ తో మార్కెట్ ఎక్స్ పాన్షన్ కి ట్రై చేస్తున్నారు, వారిలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి తో కల్ట్ ఫ్యాన్స్ ని గీత గోవిందం తో హ్యుమంగస్ సక్సెస్ ని…
సొంతం చేసుకున్న విజయ్ కి ఇతర ఇండస్ట్రీ లలో కూడా మంచి పేరు వచ్చింది, దాంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని కవర్ చేసే సినిమాలను చేయడం మొదలు పెట్టాడు, నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు ఇలాంటి కోవలోకి వచ్చినవే. కానీ 2 కూడా భారీ ఫ్లాఫ్స్ ని మూటగట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా తమిళ్ మలయాళం లో కూడా రిలీజ్ అవ్వగా అన్ని చోట్లా రెస్పాన్స్ నెగటివ్ గా ఉంది. ఇతర ఇండస్ట్రీ లలో మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసుకోవడం మంచిదే.. అలా అని అక్కడ వచ్చే చిల్లర కోటి 2 కోట్ల కోసం… ఇక్కడ కోట్లకు కోట్ల మార్కెట్ ని పణంగా పెట్టాల్సి వస్తుంది.
దాంతో తన మార్కెట్ కూడా డౌన్ అవుతూ వచ్చింది. ఇది వరకు మూవీస్ తో పోల్చితే వరల్డ్ ఫేమస్ లవర్ కి చాలా తక్కువ ఓపెనింగ్స్ దక్కాయి. దాంతో ఇప్పుడు విజయ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ కోసం ఇక్కడ కోట్ల మార్కెట్ ని మరింత పణంగా పెడతాడా లేక ఇక్కడి ఆడియన్స్ ని మెప్పించే స్టొరీ తో ఇక్కడే తన రేంజ్ ని మరింత పెంచుకుంటాడో చూడాలి.