టాలీవుడ్ లో సంక్రాంతి మూవీస్ భారీ వసూళ్ళ తో మార్కెట్ ఎక్స్ పాన్షన్ ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాయి కానీ, ఒక ఏడాది 2 ఏళ్ల క్రితం వరకు స్టార్ హీరోల సినిమాల యావరేజ్ కలెక్షన్స్ ఎంత అంటే 70 నుండి 80 కోట్ల రేంజ్ అని చెప్పేవాళ్ళు. చాలా మంది హీరోల సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ యావరేజ్ గా 70 కోట్ల నుండి 75 కోట్ల రేంజ్ లో ఉండేవి.. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
నటించిన కెరీర్ బెస్ట్ మూవీస్ కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని వసూల్ చేశాయి. సరైనోడు 75 కోట్ల రేంజ్ లో షేర్ ని, దువ్వాడ జగన్నాథం సినిమా 72 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేశాయి. కానీ ఇప్పుడు ఒక సినిమా ప్రాఫిట్ ఏకంగా ఈ మార్క్ ని అందుకుంది…
చరిత్ర లో తిరుగు లేని రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఆ సినిమానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో… ఈ సినిమా రీసెంట్ గా 5 వారాలను పూర్తీ చేసుకుని…
ఏకంగా 159 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది, ఇక 36 వ రోజు ఆదివారం వసూళ్లు తేలాల్సి ఉండగా ఈ రోజు సినిమా 25 లక్షల నుండి 30 లక్షల రేంజ్ వసూళ్లు మినిమమ్ అందుకునే అవకాశం ఉండటం తో టోటల్ కలెక్షన్స్ 159.4 కోట్ల మార్క్ ని అందుకోబోతున్నాయి. సినిమా బిజినెస్ 84.34 కోట్లు కాగా…
బిజినెస్ మీద టోటల్ ప్రాఫిట్ ఆల్ మోస్ట్ 75 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. ఇది తెలుగు సినిమా చరిత్ర లో నాన్ బాహుబలి మూవీస్ లో ఆల్ టైం సెన్సేషనల్ రికార్డ్. బహుశా ఇలాంటి రికార్డ్ రీసెంట్ టైం లో మళ్ళీ ఎ సినిమా అయినా అందుకునే చాన్స్ ఉంటుందా అంటే క్లియర్ గా చెప్పలేని రేంజ్ లీడ్ ని సొంతం చేసుకుంది ఈ సెన్సేషనల్ మూవీ.