బాహుబలి తో టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ ఎల్లలు దాటింది, RRR ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది…. వందల కోట్ల బిజినెస్ లు కలెక్షన్స్ కామన్ అయిపోయాయి… కానీ ఒకప్పుడు 30 కోట్లు-40 కోట్ల కలెక్షన్లే గొప్ప అనుకుంటున్న సమయంలో మగధీర తర్వాత తెలుగు సినిమా స్థాయి 75 కోట్ల క్లబ్ లో చేరగా తర్వాత బాహుబలి రాకతో 100 కోట్ల పైకి చేరుకుంది. కానీ టాలీవుడ్ హిస్టరీలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఈ లెక్కలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా తెలుగులో తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమా ఏది అన్న ఆసక్తికరమైన ప్రశ్న కొందరు కామెంట్స్ రూపంలో ఎక్కువగా అడిగారు…
మాకు తెలినంతవరకు శోధించి ఆ సినిమా ఏంటి అనేది చాలా వరకు తెలుసుకుని ఇక్కడ చెబుతున్నాం… టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ తెలుగు లో తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అని అంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాళ 24 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా…
7 వ సినిమా ఖుషీ తో సంచలన విజయం అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తర్వాత సినిమా అవ్వడం తో జానీ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి…. దాంతో ఈ సినిమా బిజినెస్ 25.6 కోట్లకి అటూ ఇటూ గా జరిగిందని అంచనా…కాగా సింహాద్రి సినిమా తర్వాత రావడంతో ఆంధ్రావాళ పై కూడా అంచనాలు ఓ రేంజ్ లో ఉండటంతో ఆ సినిమాకి 24 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట….
కానీ ఇటు జానీ కానీ అటు ఆంధ్రావాళ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా టాలీవుడ్ లో 2003 టైం లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకున్న సినిమా గా జానీ నిలవగా తర్వాత ఠాగోర్ 23 కోట్లకి అటూ ఇటూగా బిజినెస్ చేసిందట…మొత్తం మీద జానీ టాలీవుడ్ లో ఫస్ట్ 25 కోట్ల బిజినెస్ సాధించిన సినిమా గా నిలిచింది..
ఇక ఇప్పుడు టాలీవుడ్ లో 100 కోట్ల బిజినెస్ లు చాలా కామన్ అయిపోయాయి… రీసెంట్ గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ 200 కోట్ల నుండి 300 కోట్ల రేంజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తూ దూసుకు పోతున్నాయి. ఫ్యూచర్ లో కూడా మన హీరోల పాన్ ఇండియా మూవీస్ బిజినెస్ రేంజ్ లో మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
First 100 centers padda tholi Tollywood cinema entire?
Rey…..Johny movie oka utter flop ra …..Kanisam 10 crores kuda raNi movie ni ..25 crores tho polchuthunnava ….News pedithe pettu kaani fake pettaku raa
rey movie utter flop annadi andariki telusu… but craze valla release ki mundu business ayindi… teliste comment pettu lekunte silent ga undu…