కరోనా ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ పడటం తో కొత్త సినిమాలు ఏవి కూడా థియేటర్స్ లో రిలీజ్ కి నోచుకోలేదు. దాదాపు మూడు నెలలకు పైగానే సమయం అవ్వగా మరో రెండు నెలలు ఈజీగా సమయం పట్టే అవకాశం ఉండటం తో చాలా సినిమా లు అప్పటి వరకు ఆగలేక డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమం లో ఈ లాక్ డౌన్ టైం లో….
5 నోటబుల్ సినిమా లు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్నాయి, అమృతరామం, నవదీప్ నటించిన రన్ సినిమా, జ్యోతిక నటించిన పొన్మగల్ వందాన్ సినిమాలు మొదటి దశ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా ఒక్కటి కూడా అంచనాలను అందుకోలేక పోయింది.
ఇక రెండో దశలో హిందీ మూవీ గులాబో సితాబో సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలు తప్పగా రీసెంట్ గా సౌత్ లో అన్ని ముఖ్య భాషల్లో రిలీజ్ అయిన కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకుంది. అన్ని సినిమాలు కూడా మీడియోకోర్ సబ్జెక్ట్ తోనే తెరకెక్కగా…
థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ వీటికి రెండో రోజు నుండే ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉండేది… ఉన్నంతలో జ్యోతిక పొన్మగల్ వందాన్ సినిమా కొంచం బెటర్ కాగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా యావరేజ్ మూవీస్ అనే చెప్పాలి. దాంతో వీటిని భారీ రేటు ఆఫర్ చేసి కొంటున్న OTT యాప్స్ ఒక్క నికార్సయిన బ్లాక్ బస్టర్ కోసం…
ఎదురు చూస్తుంది, తద్వారా మరిన్ని సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతాయి అన్నది వారి ఆశ. కానీ ఇక్కడ నిర్మాతలు తమ సినిమా ల పై పెద్దగా నమ్మకం లేని వారు మాత్రమె సినిమా క్రేజ్ ని బట్టి డిజిటల్ రిలీజ్ చేసుకుని ఎంతో కొంత డబ్బు తో సేఫ్ గా నిలుస్తున్నారు…