నార్త్ ఆడియన్స్ కి మొదటి నుండి కూడా సౌత్ డబ్బింగ్ హిందీ మూవీస్ అంటే ఓ రేంజ్ లో క్రేజ్… అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అయిన చాలా సినిమాలకు ఊహకందని రికార్డులు దక్కాయి. కొన్ని సినిమాలు ఏకంగా 250 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించగా కొన్ని సినిమాలు ఇక్కడ అట్టర్ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా కానీ అక్కడ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో సంచలనాలు సృష్టించాయి.
ఇక లేటెస్ట్ గా తెలుగు లో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన మూడో సినిమా మిస్టర్ మజ్ను లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి అంచనాలు అందుకోలేక ఫ్లాఫ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ ఏడాదిన్నర తర్వాత…
రీసెంట్ గా హిందీ లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. 24 గంటల్లో సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. 24 గంటల్లో 11.2 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా 4 లక్షల 75 వేలకి పైగా లైక్స్ ని…
సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, రీసెంట్ టైం లో ఇస్మార్ట్ శంకర్ 15 మిలియన్స్ ని మొదటి 24 గంటల్లో అందుకుని రికార్డ్ సృష్టించగా ఇప్పుడు రెండో ప్లేస్ లో అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా నిలిచింది అని చెప్పొచ్చు. అలాగే లైక్స్ పరంగా కూడా ఇస్మార్ట్ శంకర్ 24 గంటల్లో 5 లక్షలకు పైగా లైక్స్ ని అందుకోగా…
ఇప్పుడు రెండో ప్లేస్ లో మిస్టర్ మజ్ను సినిమా నిలిచింది. సినిమా జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో హిందీ డబ్బింగ్ వర్షన్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అఖిల్ నటించిన కొత్త సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం….