Home TRP రేటింగ్ 7.2 కోట్ల రేటు….మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ TRP రేటింగ్ ఇదే!

7.2 కోట్ల రేటు….మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ TRP రేటింగ్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ ఎట్టకేలకు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో కెరీర్ లో మొట్ట మొదటి హిట్ ని సొంతం చేసుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం లో బరిలోకి దిగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మరీ అద్బుతమైన టాక్ ఏమి…

సొంతం చేసుకోకున్నా కానీ మంచి కలెక్షన్స్ ని కంటిన్యూగా సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే కాదు మంచి లాభాలను కూడా సొంతం చేసుకుంటూ దుమ్ము లేపింది. టోటల్ రన్ లో సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో….

బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 24.14 కోట్ల షేర్ తో 5.14 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ ఆల్ మోస్ట్ 7.2 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమాను రీసెంట్ గా…

టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు… కాగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో మంచి రేటింగ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి… మొత్తం మీద ఫస్ట్ టైం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా స్టార్ మా ఛానెల్ లో 9.31 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది అని చెప్పాలి….

ఓవరాల్ గా పర్వాలేదు అనిపించినా కానీ సినిమాకి స్టార్ మా పెట్టిన రేటు ప్రకారం చూసుకుంటే మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది అనే చెప్పాలి. డిజిటల్ లో త్వరగానే రిలీజ్ అవ్వడం టి.ఆర్.పి పై కొద్దిగా ఇంపాక్ట్ చూపింది అనే చెప్పాలి. ఇక టెలివిజన్ లో లాంగ్ రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here