లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎప్పుడో సమ్మర్ కనకగా ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాల్లో ఒకటిగా వచ్చి ఉండేది కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆగిపోగా… తర్వాత వెంటనే సినిమా డిజిటల్ రిలీజ్ పై ఇండస్ట్రీ లో వార్తలు రాగా వెంటనే యూనిట్ నుండి అలాంటి ఆలోచనలు ఏవి లేవని గట్టిగానే చెప్పారు. దాంతో సినిమాపై ఎలాంటి న్యూస్ ఇప్పటి వరకు రాలేదు…
దాంతో ఆల్ మోస్ట్ అందరూ మరచిపోతున్న టైం లో ఇప్పుడు మళ్ళీ సినిమా పై వార్తలు రావడం మొదలు అయ్యింది… సినిమా ను లీడింగ్ స్ట్రీమింగ్ యాప్ అయిన అమెజాన్ ప్రైమ్ వారు సాలిడ్ రేటు ఆఫర్ తో దక్కించుకున్నారని అంటున్నారు కానీ వీటిపై…
ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా సినిమాను పాన్ ఇండియా లో లెవల్ లో మంచి స్టార్ కాస్ట్ తో తెరకెక్కించిన నేపధ్యంలో ఇది వరకు వచ్చిన ఆఫర్ 26 కోట్ల రేంజ్ డీల్ సెట్ కాదని ఎక్కువ డీల్ అయితే ఓకే అన్నారని రూమర్స్ ఉండగా దానికి ప్రైమ్ కూడా ఓకే చెప్పి ఫైనల్ గా…
30 కోట్ల రేంజ్ లో డీల్ కి సిద్ధం అన్నట్లు చెప్పారని అంటున్నారు… కానీ యూనిట్ మాత్రం 35 కోట్ల రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేస్తున్నారని టాక్ ఉంది…. దాంతో ఇంకా నిర్ణయం ఫైనల్ అవ్వలేదని సమాచారం.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇయర్ ఎండ్ కి కూడా అన్నీ సద్దుకునేలా కనిపించడం లేదని అందునా…
ఇది డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడం తో థియేట్రికల్ బిజినెస్ అన్ని భాషల్లో గట్టిగా జరిగే అవకాశం కూడా తక్కువే కాబట్టి ఎంతో కొంత రేటుతో సినిమాను డిజిటల్ రిలీజ్ చేయడం ఉత్తమం అని భావిస్తున్నారట. మరి ఫైనల్ గా ఎంత రేటు కి ఫిక్స్ చేసి సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తారో కొన్ని రోజుల్లో తేలనుంది…