కరోనా ఎఫెక్ట్ తో అన్ని సినిమాలు OTT భాట పట్టగా… కొన్ని సినిమాలు మాత్రం ముందు మంచి ఆఫర్స్ వస్తున్నా కానీ అప్పుడు నో చెప్పి ఇప్పుడు కొంచం అటూ ఇటూగా రేట్లకి సెటిల్ అవుతున్నాయి. వి మూవీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కన్ఫాం చేసుకోక ముందు వరకు పరిస్థితి బాగానే ఉండగా కన్ఫాం అయిన తర్వాత ముందు అనుకున్న రేట్లకి వచ్చిన ఆఫర్లు అన్నీ కూడా ఇప్పుడు తగ్గుతూ పోతున్నాయి.
లేటెస్ట్ గా ఈ ప్రభావం మరో సినిమా పై పడింది. మహానటి సినిమా తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా సినిమా కి ముందు మంచి ఆఫర్ వచ్చినా అప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు.
కానీ ఇప్పుడు ఫైనల్ గా కొంచం తక్కువ రేటుకి సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ ఉంటుంది. ఇది వరకు ఈ సినిమా కి సుమారు 14 కోట్ల రేంజ్ ఆఫర్ దక్కింది. అది కూడా పెంగ్విన్ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లో సాధించిన మంచి విజయం వల్ల…
ఈ సినిమా కి ఈ రేంజ్ రేటు దక్కగా అప్పుడు ఈ ఆఫర్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరికొంత కాలం థియేటర్స్ తెరిచే పరిస్థితి లేక పోవడం తో ఇక తప్పక సినిమా ను ఇప్పుడు 11 కోట్ల రేంజ్ ఆఫర్ కి నెట్ ఫ్లిక్స్ కి అమ్మారని ఇండస్ట్రీ లో టాక్ ఉండగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ సినిమా పై ఇంకా రావాల్సి ఉంది.
ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బడ్జెట్ 5-6 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు కానీ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఆ బడ్జెట్ నిజం అయితే ఆ బడ్జెట్ ప్రకారం చూసుకున్నా సాలిడ్ రేటు సినిమా కి దక్కినట్లే లెక్క అని చెప్పొచ్చు. త్వరలోనే సినిమా పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చని అంటున్నారు.