యాక్షన్ హీరో విశాల్ కి సడెన్ షాక్ తగిలింది… తన లేటెస్ట్ సినిమా రిలీజ్ డైరెక్ట్ గా డిజిటల్ లో అవుతుందా లేదా థియేటర్స్ లో అవుతుందా అన్న డౌట్ లో ఉన్న టైం లో డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపగా ఆఫర్లు వస్తున్న టైం లో లాస్ట్ ఇయర్ విశాల్ చేసిన భారీ బడ్జెట్ మూవీ యాక్షన్ సినిమా తెచ్చిపెట్టిన లాస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ సినిమా కి…
అడ్డుగా మారి షాక్ ఇచ్చింది… యాక్షన్ సినిమా ను నిర్మించిన నిర్మాతలు ఆ సినిమా టైం లో విశాల్ సినిమా 25 కోట్ల రేంజ్ షేర్ కచ్చితంగా అందుకుంటుంది అని చెప్పడం వలనే 45 కోట్ల దాకా బడ్జెట్ పెట్టామని కానీ సినిమా భారీ నష్టాలను మిగిలించింది అని చెబుతూ…
ఆ సినిమా టైంలో విశాల్ సినిమా నష్టం వస్తే తానూ ఇస్తానని చెప్పాడని కోర్టులో కేసు వేయగా రీసెంట్ గా ముందు కోర్ట్ విశాల్ కి స్టే ఇచ్చి ముందు సినిమా రిలీజ్ చేసుకోవడానికి పర్మీషన్ ఇచ్చింది కానీ సడెన్ గా మళ్ళీ నిర్మాతలు విశాల్ తో చేసుకున్న ఒప్పందాలు అన్నీ చూపెట్టడం తో…..
ఇప్పుడు చక్ర సినిమా రిలీజ్ కి ముందు యాక్షన్ సినిమా కి వచ్చిన నష్టాలు తీర్పాల్సిందే అని తీర్పు ఇచ్చింది… దాంతో యాక్షన్ సినిమా నష్ట పరిహారం కింద 8.3 కోట్ల దాకా విశాల్ ఇప్పుడు నెల రోజుల గడువు లోగా తీర్పాల్సి ఉంటుందని సమాచారం. లేని పక్షం లో విశాల్ పై కోర్టు దిక్కారం కింద కొత్త కేసు నమోదు అవుతుందట.
ఒక పక్క చక్ర సినిమా కి కూడా బడ్జెట్ ఎక్కువే అవ్వగా డైరెక్ట్ రిలీజ్ కి బిజినెస్ తక్కువ ఆఫర్లే వేస్తున్నాయి, ఇలాంటి టైం లో మళ్ళీ 8.3 కోట్ల రేంజ్ ఫైన్ విశాల్ కి ఎదురుదెబ్బే అవుతుంది, కానీ నష్టాలు వచ్చినప్పుడు తలో ఒక చేయి వేయాల్సిందే కాబట్టి ఇప్పుడు విశాల్ ఆ నష్టాన్ని భరించక తప్పని పరిస్థితి.