Home న్యూస్ కీర్తి సురేష్ “మిస్ ఇండియా” రివ్యూ-రేటింగ్….పారిపోండిరోయ్!!

కీర్తి సురేష్ “మిస్ ఇండియా” రివ్యూ-రేటింగ్….పారిపోండిరోయ్!!

0

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ తర్వాత చేసిన చేస్తున్న సినిమాల్లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా చేస్తూ వస్తుండగా లేటెస్ట్ గా పెంగ్విన్ సినిమా ను డైరెక్ట్ రిలీజ్ చేయగా ఆ సినిమా ఆడియన్స్ ను మెప్పించ లేక పోయింది. ఇక ఇప్పుడు మిస్ ఇండియా అంటూ మరో కొత్త సినిమా ను డైరెక్ట్ గా రీసెంట్ గా రిలీజ్ చేశారు, మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయనికి వస్తే… చిన్నప్పటి నుండి చదువుల్లో టాపర్ అయిన హీరోయిన్ ను లైఫ్ లో ఒక గోల్ ఉండాలని ప్రోత్సహించిన తన తండ్రి నరేష్ సూచన మేరకు తన తాత రాజేంద్రప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్న చాయి పెట్టడం ప్రవుర్తిని….

పెద్దయ్యాక బిజినెస్ చేయాలనీ, కాఫీ తప్ప చాయి అలవాటు లేని అమెరికా లో మిస్ ఇండియా అనే చాయి కంపెనీ ని విస్తరింప జేయాలని డిసైడ్ అవుతుంది, మరి అనుకున్నది జరిగిందా లేదా, మరో బిజినెస్ మాన్ జగపతి బాబు హీరోయిన్ కి ఎలా అడ్డుపడ్డాడు లాంటివి సినిమా చూసి తెలుసు కోవాల్సిందే.

అతి సాధారణ కథను అత్యంత సాదాసీదా స్క్రీన్ ప్లే తో ఎలాంటి మలుపులు లేకుండా తర్వాత ఒక్కటే కాదు తర్వాత కథ మొత్తం చూస్తున్న వాళ్ళు ఊహించే విధంగా సినిమా మొత్తం స్క్రీన్ ప్లే రాసుకోవడం ఈ సినిమా ప్రత్యేకత.. ఆడియన్స్ సినిమా చూస్తూ బోర్ ఫీల్ అవుతున్నా కానీ… తర్వాత సీన్ ఈ విధంగా ఉంటుంది అని గెస్ చేస్తారు.

వారి ఊహలను ఏమాత్రం మిస్ కాకుండా తర్వాత ఊహించిన సీన్ వస్తుంది, ఇలా ఫ్లాట్ నరేషన్ తో సినిమా మొత్తం కొనసాగుతుంది, కథలో మినిమమ్ దమ్ము లేకపోవడం మరో పక్క కీర్తి సురేష్ మహానటి నుండి ఈ సినిమా కోసం బరువు తగ్గడంతో ఆమె చార్మ్ తగ్గినట్లు క్లియర్ గా తెలిసిపోతుంది.

దాంతో చూస్తున్న ఆడియన్స్ మరింత బోర్ ఫీల్ అవ్వడం ఖాయం. ఉన్నంతలో కీర్తి సురేష్ అసలు ఏమాత్రం ఇంపాక్ట్ లేని కథకి ఎంతో కొంత నటించి మెప్పించే ప్రయత్నం చేసింది కానీ మహానటి తో పోల్చితే అది ఏమాత్రం సరిపోలేదు అనే చెప్పాలి. నదియా, నరేష్, రాజేంద్రప్రసాద్ మరియు నవీన్ చంద్ర కొద్ది వరకు మెప్పించగా…

మిగిలిన నటీనటులు ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తారు, జగపతిబాబు విలనిజం పరమ రొటీన్ కన్నా కూడా తక్కువగా ఉంది… సంగీతం జస్ట్ యావరేజ్ కాగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు.

ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నార్చ్ లెవల్ లో ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని సీన్స్ లో అమెరికన్ భాషలో డబ్బింగ్ చెప్పేవాళ్ళు కరువు అయ్యి గూగుల్ అసిస్టంట్ వాయిస్ ఓవర్ తో చెప్పించడం కొంత షాక్ ఇచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉందని చెప్పొచ్చు. ప్రతీ సన్నివేశం చాలా రిచ్ గా ఉంటుంది.

ఇక చివరగా డైరెక్షన్ విషయానికి వస్తే నరేంద్రనాథ్ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, అమెరికాలో చాయి కంపెనీని పెట్టడం అన్న థాట్ బాగున్నా దాన్ని కరెక్ట్ గా ఎస్తాబ్లేష్ చేయలేదు, హీరోయిన్ అసలు పెద్దగా కష్టపడకుండానే ఫండ్స్ ని దక్కించుకుంటూ బిజినెస్ లో అప్పటికే టాప్ లో ఉన్న….

జగపతిబాబు కి సవాల్ విసురుతూ ఉంటుంది, విలన్ హీరోయిన్ ని 2-3 నెలలకే పోటి తట్టుకోలేక తన బిజినెస్ ని దెబ్బ తీస్తే… మా చాయి కంపెనీ ఇబ్బందులో ఉంది ఆదుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తే భారీ డొనేషన్స్ దక్కుతాయి… ఇలాంటి సీన్స్ ఎన్ని సినిమాల్లో ఎన్ని సార్లు చూశామో లెక్కే లేదు అని చెప్పాలి. ఇలా సినిమా మొత్తం….

నాసిరకం సీన్స్ తో ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక చూస్తున్న ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తాయి. ఓవరాల్ గా రొటీన్ మూవీస్ చూసే వాళ్ళు కూడా సినిమాలో పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏమి లేదనే చెప్పాలి.. అయినా రిచ్ విజువల్స్ కోసం మెయిన్ థీం కోసం కష్టపడి ఒకసారి చూడొచ్చు…సినిమా మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here