బాక్స్ ఆఫీస్ దగ్గర ఒప్పెన సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు జోరు చూపుతూ దూసుకు పోతుంది. సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆ టైం లో కూడా ఇంత క్రేజ్ ని సినిమా సొంతం చేసుకోలేదు, కానీ లాక్ డౌన్ టైం లో సాంగ్స్ మరింత ఎక్కువ రీచ్ దక్కడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా తర్వాత డిజిటల్ రిలీజ్ కి ఎన్ని ఆఫర్లు వచ్చినా కానీ…
నో చెబుతూ రాగా చివరికి ఓ అద్బుతమైన రేటు ఆఫర్ వచ్చిన తర్వాత నిర్మాతలు టెంప్ట్ అవ్వగా ఆ విషయాన్నీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్ళి సినిమాకి ఓ భారీ రేటు వచ్చింది, డిజిటల్ రిలీజ్ కి ఏమంటారు అంటూ చెప్పుకొచ్చారట. కానీ సినిమా పై నమ్మకంగా ఉన్న చిరు మాత్రం…
నిర్మాతలతో ఎట్టి పరిస్థితులలో కూడా అలాంటి నిర్ణయం తీసుకోకండి, సినిమా క్లైమాక్స్ సినిమా కి ఎక్కువ రీచ్ దక్కేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చిన చిరు అలాగే ఈ నిర్ణయం కనుక తప్పైతే ఇక సినిమాల జడ్జిమెంట్ విషయం లో ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయాలు….
తీసుకోను అంటూ ఆల్ మోస్ట్ ఛాలెంజ్ చేశారట… ఈ విషయాన్నీ నిర్మాతలు రీసెంట్ గా ఇంటర్వ్యూ లలో కన్ఫాం చేశారు. చిరు కాన్ఫిడెంట్స్ వలెనే సినిమాను చాలా ఏరియాల్లో మేమే రిలీజ్ చేశాం అంటూ చెప్పుకొచ్చారు నిర్మాతలు. చిరు నమ్మకం ప్రకారమే సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ డెబ్యూ హీరోల పరంగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతలాను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. చిరు కూడా తన మాట ఇప్పుడు నిజం అయిన సందర్భంగా ఫుల్ ఖుషీ లో ఉన్నారని తెలుస్తుంది. ఇన్నేళ్ళ ఎక్స్ పీరియన్స్ తో మెగాస్టార్ సినిమాల విషయంలో తన డిసిషన్ మేకింగ్ పవర్ ని మరోసారి చూపెట్టారు అని చెప్పొచ్చు.