Home న్యూస్ ప్లే బ్యాక్ మూవీ రివ్యూ…ఇలాంటి మూవీ చూసి ఉండరు!!

ప్లే బ్యాక్ మూవీ రివ్యూ…ఇలాంటి మూవీ చూసి ఉండరు!!

0

చిన్న సినిమాలలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో మూవీ ప్లే బ్యాక్, హుషారు సినిమాలో నటించిన దినేష్ హీరోగా, మల్లేశం సినిమాలో నటించిన అనన్య హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ప్లే బ్యాక్ ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అనేక అవరోధాలను ఎదురుకుని ఎట్టకేలకు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది, మరి సినిమా ఎలా ఉందొ ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి విశేషాలను గమనిస్తే… ముందుగా కథ పాయింట్ కి వస్తే…

ఫోన్ పరిచయం ద్వారా హీరోయిన్ తో మాట్లాడే హీరో రెండు మూడు రోజులు మాట్లాడుకున్న తర్వాత ఒక షాక్ ఇచ్చే నిజం తెలుస్తుంది, అదేంటంటే… హీరోయిన్ ఫోన్ చేసింది 1993 టైం లో అయితే హీరో ఉండేది 2019 టైం లో…అదేంటి హీరోయిన్ ఆ టైం నుండి ఇప్పుడు హీరోకి ఎలా ఫోన్ చేసింది, అసలు ఈ మిస్టరీ ఏంటి లాంటి ఆన్సర్స్ కోసం సినిమా చూసి తీరాల్సిందే…

కాన్సెప్ట్ వరకు సినిమా ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది, ఇలాంటి కాన్సెప్ట్ తోనే రీసెంట్ గా కోలివుడ్ డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో అంధకారం అనే సినిమా వచ్చింది కానీ ఆ కథ వేరు ఈ కథ వేరు, కానీ స్టొరీ పాయింట్ ఎంత ఆసక్తిగా ఉన్నప్పటికీ కథనం అండ్ ఎడిటింగ్ అంత పకడ్బందీగా లేకపోవడం సినిమా ప్రధాన మైనస్ పాయింట్, ఇక స్టార్ కాస్ట్ కూడా అందరూ కొత్తవాళ్ళు కాబట్టి ఉన్నంతలో అందరూ బాగానే చేశారు.

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి కానీ మరీ ఎఫెక్టివ్ గా లేవు, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, 1993 టైం కి తగ్గట్లు సెట్స్ పర్వాలేదు అనిపించగా ఓవరాల్ గా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో మెప్పించిన సినిమాను డైరెక్ట్ చేసిన విధానం అంతగా మెప్పించలేదు, బహుశా తనకున్న పరిమితుల వలన డైరెక్టర్ సినిమాను తను అనుకున్న విధంగా తెరకెక్కించి ఉండలేక పోయాదేమో అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఎంత నచ్చినా సినిమా పరంగా చూసుకుంటే…

మరీ కాన్సెప్ట్ కి తగ్గట్లు సినిమాను తెరకెక్కించకపోయినా ఉన్నంతలో పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్… మరింత శ్రద్ధ పెట్టి ఉంటె సినిమా మరో రేంజ్ లో ఉండి ఉండేది, ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసినందుకు కచ్చితంగా టీం ని మెచ్చుకుని తీరాల్సిందే, అందుకే సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here