బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఉప్పెన సినిమా టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది, సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోయిన ఈ సినిమా థియేట్రికల్ రన్ లో సంచలనాలను సృష్టించింది, కానీ సినిమా లాస్ట్ ఇయర్ ఉన్న పరిస్థితులు వేరు ఈ ఇయర్ రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు వేరు అని చెప్పొచ్చు. ఏడాదిలో హైప్ సాలిడ్ గా పెంచుకున్న సినిమా…
అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎపిక్ రికార్డులను క్రియేట్ చేసింది, మొత్తం మీద సినిమా బడ్జెట్ ఎంత టోటల్ గా సాధించిన బిజినెస్ ఏంటి… మొత్తం మీద ఎలాంటి ప్రాఫిట్ లను సినిమా సొంతం చేసుకుందో ఒకసారి గమనిస్తే… సినిమా ఓవరాల్ గా బడ్జెట్…
28 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా శాటిలైట్ రైట్స్ కింద 8 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా, డిజిటల్ రైట్స్ కింద 7 కోట్ల రేటు ని సొంతం చేసుకుంది, ఇక డబ్బింగ్ రైట్స్ కింద 6 కోట్ల రేటు ను సొంతం చేసుకోగా మ్యూజిక్ రైట్స్ కింద 80 లక్షల రేటు ను సొంతం చేసుకుంది.
దాంతో టోటల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా కి 21.8 కోట్ల రికవరీ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా కి 20.5 కోట్లు సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి 42.3 కోట్ల టోటల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.
దాంతో బిజినెస్ మీద ఇప్పుడు 14.3 కోట్ల ప్రాఫిట్ ను బడ్జెట్ మీద టోటల్ బిజినెస్ లో సొంతం చేసుకోగా సినిమా బిజినెస్ 20.5 కోట్ల మీద టోటల్ రన్ లో 51.52 కోట్ల షేర్ తో 30.52 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. నిర్మాత కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ కాబట్టి ఎక్స్ లెంట్ ప్రాఫిట్ ను ఈ సినిమా తో సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు.