యంగ్ హీరోల్లో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ లో మంచి బిజినెస్ ను తక్కువ సినిమాలతోనే సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక్క సారి మాత్రమే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు హిట్ తర్వాత చేసిన సినిమా అల్లుడు అదుర్స్… బాక్స్ ఆఫీస్ దగ్గర…
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కి తొలి ఆటకే పరమ రొటీన్ మూవీ అంటూ డిసాస్టర్ టాక్ స్ప్రెడ్ అయింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది ఈ సినిమా…
ఇక ఇలాంటి టైం లో రీసెంట్ గా ఈ సినిమా కి హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఏకంగా 11 కోట్లకు పైగా రేటు సొంతం అయ్యి సంచలనం సృష్టించగా తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా 3.5 కోట్ల సాలిడ్ రేటు ని సొంతం చేసుకుంది. డిసాస్టర్ మూవీ అయినా కానీ ఈ రేంజ్ రేటు సొంతం అవ్వడం అంటే…
మామూలు విషయం కాదు, ఇక సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు, డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియా లో తెగ ట్రోల్ అయింది, ఇదేమి రొట్ట కొట్టుడు మూవీ అంటూ విమర్శలను ఎదురుకున్న ఈ సినిమా టెలివిజన్ లో చాలా తక్కువ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అని అంతా భావించగా…
ఏకంగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.92 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. సినిమా టాక్ కి ఎక్స్ పెర్ట్ చేసిన రేటింగ్ కన్నా చాలా ఎక్కువ రేటింగ్ నే సినిమా సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ టైం చాలా వరకు పెట్టిన డబ్బుని రికవరీ చేసిన ఈ సినిమా తర్వాత టెలికాస్ట్ తో కంప్లీట్ రికవరీ సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.