చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తేజ సజ్జ ఈ ఇయర్ ఆల్ రెడీ ఒక సూపర్ హిట్ ని సొంతం చేసుకోగా సమ్మర్ కానుకగా మరో సినిమా ను ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ఫుల్ ట్రై చేశాడు కానీ ఈ లోపు సెకెండ్ వేవ్ గట్టిగా రావడం తో ఆ సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. దాంతో ఇష్క్ సినిమా ను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయించడానికి వరుస పెట్టి….
ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా మేకర్స్ వాటికి నో చెప్పారు, ఆఫర్స్ అయినా ఆగకుండా ఏకంగా 8 కోట్ల రేటు దాకా వెళ్ళినా కూడా మేకర్స్ నో చెప్పి సినిమా ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి సెకెండ్ పాండమిక్ తర్వాత ఇప్పుడు సినిమా ను…
తిమ్మరుసు సినిమా తో పాటు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ట్రేడ్ లో రిలీజ్ అవ్వగా ఆ లెక్కల ప్రకారం సినిమా సాధించిన ఓవరాల్ బిజినెస్ ను గమనిస్తే…నైజాం లో ఈ సినిమా 1.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది..
ఇక ఆంధ్రాలో సినిమా 1.1 కోటి బిజినెస్ ను సాధించిందట. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కలిపి 10 లక్షల బిజినెస్ జరగగా ఓవరాల్ గా సినిమా 2.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇందులో కూడా ఓన్ రిలీజ్, మినిమం గ్యారెంటీ, షేర్ గ్యారెంటీ లాంటి బిజినెస్ మాడల్స్ తో ఈ సినిమా బిజినెస్ ను కంప్లీట్ చేసుకోగా…
ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 2.7 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ బిజినెస్ ను రికవరీ చేసి క్లీన్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి… ఆల్ మోస్ట్ 280 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు.