తేజ సజ్జ హీరోగా ఈ ఇయర్ జాంబి రెడ్డి సినిమా తో సూపర్ హిట్ ని అందుకోవడం తో తన కొత్త సినిమా ఇష్క్ మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ పాండమిక్ వలన పోస్ట్ పోన్ అవ్వగా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయించడానికి వరుస పెట్టి OTT డీల్స్ వచ్చినా కానీ మేకర్స్ వాటికి అన్నింటికీ కూడా…
నో చెప్పారు. ఏకంగా 8 కోట్ల రేంజ్ డీల్ కూడా వచ్చినా కానీ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకున్న తిమ్మరుసుకి పోటిగా రిలీజ్ అయిన ఈ సినిమాను మొత్తం మీద…
2.5 కోట్ల రేంజ్ రేటు కి టోటల్ వరల్డ్ వైడ్ రైట్స్ ను అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా తిమ్మరుసు కన్నా బెటర్ గా ఓపెనింగ్స్ ని స్టార్ట్ చేసినా తర్వాత కంప్లీట్ గా ట్రాక్ తప్పి…
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికే మేజర్ థియేటర్స్ అన్నింటినీ కోల్పోగా మొత్తం మీద పరుగును త్వరగానే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో పరుగు పూర్తీ అయ్యే టైం కి 68 లక్షల షేర్ ని అలాగే వరల్డ్ వైడ్ గా 83 లక్షల దాకా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది.
మొత్తం మీద సినిమా 2.7 కోట్ల టార్గెట్ లో 1.87 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని ట్రిపుల్ డిసాస్టర్ గా పరుగును ముగించింది. 8 కోట్ల రేటు కి ఓకే చెప్పి ఉంటె నిర్మాతలకు మంచి లాభాలు సొంతం అయ్యేవి కానీ అలా కాకుండా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోవడం తో భారీ నష్టాలనే సొంతం చేసుకుని పరుగును ముగించాల్సి వచ్చింది సినిమా..