బాక్స్ ఆఫీస్ దగ్గర ఛలో సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వరుడు కావలెను… రీసెంట్ టైం లో వచ్చిన నాగ శౌర్య మూవీస్ లో ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 29న రిలీజ్ కానుండగా…
రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని అక్కడ నుండి U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ టైం 2 గంటల 13 నిమిషాల వరకు ఉందని సమాచారం. ఇక సెన్సార్ రిపోర్ట్ చాలా వరకు పాజిటివ్ గానే వినిపిస్తుంది ఈ సినిమా విషయం లో…
ఓవరాల్ గా ఇనీషియల్ టాక్ అక్కడ నుండి పాజిటివ్ గా ఉండగా ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ బాగా ఉంటుందని, లీడ్ పెయిర్ మధ్య సీన్స్ ఆకట్టుకోగా వెన్నెల కిషోర్ కామెడీ బాగా ఆకట్టుకుందని అంటున్నారు. ఇక సెకెండ్ ఆఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ నుండి….
ఎమోషనల్ టచ్ తో సీన్స్ ఉంటాయని, ముఖ్యంగా నదియా మరి రితు వర్మల సీన్స్ బాగా వచ్చాయని, క్లైమాక్స్ కూడా ఎమోషనల్ టచ్ తో ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఎంటర్ టైన్ మెంట్ తో మొదలై ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుందని అంటున్నారు… సాంగ్స్ బాగుండటం ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా కి మరింత ప్లస్ పాయింట్ అని అంటున్నారు….
మొత్తం మీద సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గానే ఉన్నా ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్ ఆడియన్స్ ఎంత వరకు ఓన్ చేసుకుంటారో చూడాలి. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా ఆల్ మోస్ట్ 180 లోకేషన్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది, ఇక సినిమా సెన్సార్ కి వినిపించిన రేంజ్ టాక్ రిలీజ్ అయ్యాక కామన్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నాగశౌర్య హిట్టు కొట్టే అవకాశం ఉంటుంది…