బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు పండగ సెలవుల అడ్వాంటేజ్ వలన పండగ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం బాక్స్ ఆఫీస్ పరిస్థితి కష్టతరం అయింది. సినిమా కి నైజాం లో అలాగే మిగిలిన చోట్ల డ్రాప్స్ హెవీగా ఉండగా….
అన్ని ఏరియాలు మించి నైజాం ఏరియాలో డ్రాప్స్ మరీ ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ దెబ్బ ఊహించిన దాని కన్నా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతుంది. ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందీ అంటే రీసెంట్ టైం లో ఏ సినిమా కి కూడా జరగనిది….
ఈ సినిమా విషయంలో జరుగుతుంది అని చెప్పాలి… రీసెంట్ టైం లో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ గమనిస్తే… ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల వలన అక్కడ టికెట్ రేట్లు భారీగా తగ్గిపోవడం జరిగింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన అన్ని సినిమా లకు కూడా….
టాక్ బాగుంటే నైజాంలో బ్రేక్ ఈవెన్ అవుతున్నా కానీ ఆంధ్ర ఏరియాలలో మాత్రం బ్రేక్ ఈవెన్ అన్నది సాధ్యం అవ్వడం లేదు, రీసెంట్ హిట్ మూవీస్ అఖండ, పుష్ప లాంటి సినిమాలు కూడా కంప్లీట్ గా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వని పరిస్థితి… కానీ నైజాం లో లాభాలు భారీగా రాగా ఇప్పుడు బంగార్రాజు సినిమా పరిస్థితి కంప్లీట్ గా డిఫెరెంట్ గా మారింది….
ఆంధ్ర ఏరియాలలో ఆల్ మోస్ట్ అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అవుతున్న ఈ సినిమా నైజాం లో వర్త్ బిజినెస్ 11 కోట్ల రేటు ని అందుకోవాలి అంటే ఇంకా 3.08 కోట్ల మార్క్ ని అందుకోవాలి…. ఇది ప్రస్తుతానికి అసాధ్యంగా కనిపిస్తూ ఉండగా ఈ ఏరియాలో రీసెంట్ టైం లో లాస్ అవుతున్న సినిమాగా ఈ సినిమానే నిలవబోతుంది అని చెప్పాలి. లాంగ్ రన్ లో ఏదైనా అద్బుతం జరిగితే నష్టాలు కొంచం కవర్ అయ్యే అవకాశం ఉంది.