బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 6 ఏళ్ల కి మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అక్కినేని అఖిల్… అఖిల్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయినా కానీ బాక్స్ ఆఫీస్ విజయం మాత్రం దక్కలేదు, తర్వాత చేసిన హలో కానీ మిస్టర్ మజ్ను కానీ పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్ట లేక పోయాయి అని చెప్పాలి…
ఇలాంటి టైం లో అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అద్బుతమైన టాక్ ఏమి సొంతం చేసుకోక పోయినా కానీ కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది…
ఆ సినిమా తర్వాత ఫుల్ మాస్ రోల్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అతి త్వరలో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమాలో మలయాళ టాప్ స్టార్స్ లో ఒకరైన….
మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉండగా సినిమా పై అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా విషయంలో ఓ సెన్సేషనల్ అప్ డేట్ వచ్చింది. ముందు కేవలం తెలుగు వరకే పరిమితం అయిన ఈ సినిమాను తర్వాత మలయాళంలో కూడా డబ్ చేయాలనీ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను….
ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు… ఈ విషయాన్నీ సురేందర్ రెడ్డి గారి భార్య అఫీషియల్ గా కన్ఫాం చేయడం విశేషం. దాంతో ఈ సారి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఊరమాస్ హిట్ తో పాటు పాన్ ఇండియా లెవల్ లో దుమ్ము లేపే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఔట్ పుట్ ఏ రేంజ్ లో వచ్చిందో చూడాలి ఇక.