బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నాగషౌర్య నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి రోజు యావరేజ్ అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించి మొదటి రోజు కి మించి షేర్ ని సొంతం చేసుకుని జోరు చూపించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజుతో పోల్చితే మూడో రోజు ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో గ్రోత్ ని చూపించింది, కానీ నైట్ షోల టైం కి…..
ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కొద్ది వరకు ఇంపాక్ట్ చూపించగా మొత్తం మీద సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో కోటికి పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సగం టార్గెట్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక బాక్స్ అఫీస్ దగ్గర మూడు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇక…