ఓవర్సీస్ మార్కెట్ అంటే అది అందరి హీరోల సొత్తు…సరైన సినిమా పడితే అన్ని సినిమాలు అక్కడ కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తాయి. అక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా చాలా తక్కువగా ఉంటుంది…ఆ అడ్వాంటేజ్ ని వాడుకోవాలి అంటే మాత్రం మంచి పాజిటివ్ టాక్ రావాలి.
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ను ఏలుతున్న గీత గోవిందం సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ ఇక్కడితో పాటు ఓవర్సీస్ లో కూడా చారిత్రిక కలెక్షన్స్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.
సినిమాను అక్కడ 2.7 కోట్లకు అమ్మగా…మినిమమ్ 0.8 మిలియన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టోటల్ రన్ లో మరింత ముందుకు వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.