బాలీవుడ్ లో ఈ ఇయర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలే తక్కువ అంటే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఎవ్వరి ఊహలకు అందని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమాగా హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విక్రమ్ వేద నిలుస్తుంది. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను…
సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ఆల్ మోస్ట్ 150 కోట్ల రేంజ్ బడ్జెట్ ని ప్రమోషన్స్ తో కలిపి నిర్మాణం అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది.
సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఇండియా లో 79 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 40 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించు కుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా అందుకోగా టోటల్ షేర్ 68 కోట్ల దాకా సొంతం చేసుకుంది…
ఓవరాల్ గా బడ్జెట్ లో సగం కూడా రికవరీ చేయలేక పోయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచింది. ఒరిజినల్ వర్షన్ ఆల్ రెడీ అందుబాటులో ఉండటం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయింది. దాంతో హిట్ టాక్ తో కూడా ఫ్లాఫ్ గా పరుగును పూర్తీ చేసుకుంది.