కెరీర్ లో ఎప్పటి నుండో ఓ మాస్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో క్లాస్ హిట్ కొట్టినా కూడా మొదటి సినిమా నుండే మాస్ హిట్ అందుకోవాలని ట్రై చేసినా సొంతం అవ్వని ఆ మాస్ హిట్ ఇప్పుడు ఏజెంట్ మూవీ తో సొంతం చేసుకోవాలని ఆశ పడ్డ అఖిల్ అక్కినేని ఆశలు నిజం అయ్యయో లేవో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… ఏజెంట్ అయిన విలన్ తర్వాత రోగ్ గా మారతాడు, తనని పట్టుకోవడానికి సీనియర్ ఆఫీసర్ మమ్ముట్టి హీరోని రంగంలోకి దింపుతాడు…. తర్వాత ఏం జరిగింది అన్నది సింపుల్ గా సినిమా స్టొరీ పాయింట్….
సినిమాలో స్టొరీ పాయింట్ ఓవరాల్ గా చెప్పడానికి ఇది మాత్రమే… అతి సాదరమైన స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఏజెంట్ లో అఖిల్ అక్కినేని తన రోల్ కోసం పడ్డ కష్టం, తన బాడీ ని సినిమా కోసం మార్చుకున్న తీరు, తన ఎనర్జీ, హీరోయిజం ఎలివేట్ అయ్యే కొన్ని సీన్స్ మినహా మొత్తం సినిమా కూడా…
కంప్లీట్ గా డైరెక్టర్ ఫాల్ట్ అనే చెప్పాలి… సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు, ఈ సాదారణ కథ కోసమా 80 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి స్టైలిష్ యాక్షన్ మూవీ తీసాడా అనిపిస్తుంది సినిమా చూశాక, ఇక కొన్ని గ్రాఫిక్స్ అయితే ఎంత నాసికరంగా ఉన్నాయో…. ఫస్టాఫ్ లో కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టగా లవ్ స్టొరీ అసలు ఏమాత్రం సెట్ అవ్వలేదు…
హీరోయిన్ కి అసలు లిప్ సింక్ లేదు, తన పెర్ఫార్మెన్స్ కూడా బిలో యావరేజ్. మమ్ముట్టి గారి రోల్ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదు… ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్ మైనస్ పాయింట్, గోవింద సాంగ్ అసలు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇక సెకెండ్ ఆఫ్ లో కథ ఎటు నుండి ఏటో వెళుతూ…
తల తోక లేకుండా నత్తనడకన సాగుతుంది… ఫైట్ సీన్స్ లో స్లో మోషన్ ఎఫెక్ట్ ఒకసారి బాగుంది అనిపిస్తుంది కానీ అన్ని ఫైట్స్ లో ఇది వాడటంతో చిరాకు తెప్పిస్తుంది… మొత్తం మీద సినిమాలో కొంచం లౌడ్ గా ఓవర్ ది టాప్ అనిపించినా కూడా అఖిల్ రోల్ ఒక్కటి తప్ప మిగిలిన అన్ని ఎలిమెంట్స్ కూడా…
అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి… అఖిల్ పెర్ఫార్మెన్స్ కోసం తను సినిమా కోసం పడ్డ కష్టం కోసం ఒకసారి ఓపిక చేసుకుని చూడొచ్చు కానీ ఓవరాల్ గా సినిమా పరంగా చెప్పాలి అంటే ఏమాత్రం వైల్డ్ గా లేని ఈ వైల్డ్ సాలా ఏజెంట్ నిరాశ పరిచాడు అని చెప్పాలి.
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే…
*హీరో ఎంట్రీ
*మినిస్టర్ తో వార్నింగ్ సీన్( ఈ ఒక్క సీన్ మాత్రం హైలేట్)
*ఇంటర్వెల్ ఎపిసోడ్
*అఖిల్ వన్ మ్యాన్ షో
ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
*కథ
*స్క్రీన్ ప్లే
*మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్
*సెకెండ్ ఆఫ్
*ఎడిటింగ్ పార్ట్
*డైరెక్షన్
ఇలా చెప్పుకుంటూ పొతే సినిమాలో చాలానే మైనస్ లు ఉన్నాయి…
మొత్తం మీద అఖిల్ కి ఏజెంట్ అఖిల్ ఫ్యాన్స్ ని కొద్ది వరకు పర్వాలేదు అనిపించవచ్చు కానీ మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడం చాలా కష్టమే. చాలా ఓపిక చేసుకుని చూస్తె అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది ఏజెంట్ మూవీ… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…అది కూడా అఖిల్ పడ్డ కష్టానికి…