టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా రూపొండుతున్న సినిమా A1 ఎక్స్ ప్రెస్…. తమిళ్ బ్లాక్ బస్టర్ నాప్టే తునై అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకేక్కుతుండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి బిజినెస్ ను సొంతం చేసుకుంది, క్లీన్ హిట్ కొట్టాలి అంటే ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాలి…
లాంటి విషయాలను గమనిస్తే… సినిమాకి నైజాం ఏరియాలో 1.6 కోట్ల బిజినెస్ జరగగా సీడెడ్ ఏరియాలో 50 లక్షల బిజినెస్ జరిగింది. ఇక టోటల్ ఆంధ్రా రీజన్ లో 2.3 కోట్ల బిజినెస్ జరగగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ఈ సినిమాకి…
4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి 20 లక్షల దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 5 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి కానీ పోటి కూడా తీవ్రంగానే ఉండటం తో ఎంతవరకు ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో అన్నది ఆసక్తి కరం…
ఇక పోటి లో చాలా సినిమాలే ఉన్నాయి కాబాట్టి ఈ సినిమా ఓపెనింగ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ 30 లక్షల నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి, ఇక టాక్ ని బట్టి తర్వాత గ్రోత్ ని బట్టి కలెక్షన్స్ ఎంతవరకు వెలతాయో చూడాలి ఇక. కెరీర్ కి 25 వ సినిమా కాబట్టి సేఫ్ సైడ్ లో రీమేక్ తో కచ్చితంగా హిట్ కొడతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సందీప్ కిషన్…