Home న్యూస్ డిసాస్టర్ ఎఫెక్ట్…కొత్త సినిమా డైరెక్ట్ OTTకి…రేటు ఎంత పలికిందంటే!!

డిసాస్టర్ ఎఫెక్ట్…కొత్త సినిమా డైరెక్ట్ OTTకి…రేటు ఎంత పలికిందంటే!!

0

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తేజ సజ్జ నటించిన ఓ బేబీ మరియు హీరోగా చేసిన జాంబి రెడ్డి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల తర్వాత వరుస పెట్టి సినిమాలను కమిట్ అయ్యాడు తేజ సజ్జా… వాటిలో ఇష్క్, అద్భుతం, హ‌నుమాన్.. ఇలా వ‌రుస‌గా సినిమాల ఆఫర్స్ దక్కగా వాటిలో ఇష్క్ సినిమా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ కి…

మంచి మంచి ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పి సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా 2.5 కోట్ల బిజినెస్ చేసిన ఆ సినిమా 2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 83 లక్షలు మాత్ర్రమే కలెక్ట్ చేసి…

ఏకంగా 1.87 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది… అలాంటి రిజల్ట్ తర్వాత ఆడియన్స్ ముందుకు రావాల్సిన అద్బుతం సినిమా పై పునరాలోచనలో పడ్డ టీం సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అన్న డౌట్ ఉన్న నేపధ్యంలో డైరెక్ట్ రిలీజ్ కోసం…

ఆఫర్స్ వింటూ ఉండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు సినిమా ని డిజిటల్ అండ్ స్టార్ మా లో శాటిలైట్ రైట్స్ కి డీల్ ని ఫైనలైజ్ చేసుకున్నారు. సినిమాను మొత్తం మీద 3.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారని టాక్ ఉంది కానీ అఫీషియల్ లెక్కలు బయటికి రాలేదు, ఇక డిజిటల్ అండ్ శాటిలైట్ రెండూ కలిపి ఈ సినిమా మొత్తం మీద…

7 కోట్ల దాకా రేటు ని సొంతం చేసుకుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. బడ్జెట్ లెక్కల్లో చూసుకుంటే సినిమా కి ఇక్కడే 3.5 కోట్ల ప్రాఫిట్ ఓవరాల్ గా దక్కిందని చెప్పాలి. ఇక ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్స్ కూడా జరుగుతున్నాయట. త్వరలోనే వాటి పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. డిసాస్టర్ తర్వాత ఇది ఓవరాల్ గా మంచి డీల్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here