టాలీవుడ్ డైరెక్టర్స్ లో క్లాస్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు… వారు తీసిన పాత సినిమాల వల్ల ఆ టాగ్ వాళ్ళకి ఆటోమాటిక్ గా వచ్చేసింది. అలాంటి డైరెక్టర్స్ లో ముందు నిలిచే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల… కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద మరియు బ్రహ్మోత్సవం సినిమాలు డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే అల్ట్రా క్లాస్ గా ఉంటాయని ఫిక్స్ అయ్యారు అందరు కూడాను…
కానీ బ్రహ్మోత్సవం డిసాస్టర్ తర్వాత తనని తాను పూర్తిగా మార్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఎవ్వరూ అసలు గెస్ కూడా చేయని విధంగా తమిళ్ ఊరమాస్ మూవీ అయిన అసురన్ ని తెలుగు లో వెంకీ తో రీమేక్ చేసే చాన్స్ దక్కించుకున్నాడు. దాంతో అందరూ షాక్…
క్లాస్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడా అని…. ఈ కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ కూడా అయ్యి ఉండేది కానీ ఇప్పటికి చాలా పార్ట్ షూటింగ్ జరిగి ఆగిపోయింది. కాగా ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ మెస్మరైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.
ఒరిజినల్ కి మించి తన పాత సినిమాల ఇంపాక్ట్ పూర్తిగా తొలగేలా తన డైరెక్షన్ ఉంటుందని అంటున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా తమిళ్ లో సినిమాలో హైలెట్ అయింది ధనుష్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫైట్ సీన్స్… ఇక్కడ ఆ ఫైట్ సీన్స్ ని మరింత మాస్ గా తీశారని అంటున్నారు…
వెంకీ మరో లెవల్ లో ఆ సీన్స్ లో రచ్చ చేస్తారు అన్నది టాక్.. ఇది ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది కానీ శ్రీకాంత్ అడ్డాల కుమ్మెశారు అంటున్నారు కాబట్టి ఆ ఫైట్ సీన్స్ ఏ రేంజ్ లో వచ్చి ఉంటాయో అని అందరూ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఈ ఇయర్ లో వచ్చే చాన్స్ తక్కువే అంటున్నారు. వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో సినిమా నిలుస్తుందని అంటున్నారు.. సో అప్పటి వరకు ఆగక తప్పదు…