Home న్యూస్ ఇది 1000 కోట్ల సినిమానే….ఆదిపురుష్ ట్రైలర్2 రివ్యూ!!

ఇది 1000 కోట్ల సినిమానే….ఆదిపురుష్ ట్రైలర్2 రివ్యూ!!

2

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమా ఆది పురుష్. ప్రభాస్ నటించిన ఈ సినిమా మీద ఇప్పుడున్న అంచనాలు అయితే మరో లెవల్ కి వెళ్ళిపోయాయి. టీసర్ రిలీజ్ టైంలో ఎన్నో ట్రోల్స్ ని ఫేస్ చేసిన పరిస్థితి నుండి ఇప్పుడు స్కై హై లెవల్ లో అంచనాలు పెరిగి పోయే రేంజ్ కి వెళ్ళిపోయింది ఆదిపురుష్(Adi Purush)…

రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా నుండి రెండో ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ మొదటి ట్రైలర్ కి మించి ఆకట్టుకుంది, విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ, గ్రాఫిక్స్ కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ…. ప్రభాస్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి…

మొత్తం మీద టీసర్ లో కాంట్రవర్సీకి కారణం అయిన సైఫ్ అలీ ఖాన్ లుక్స్ ని ఇక్కడ కూడా చూపించకుండా మరో లుక్ ని చూపించి ఆ లుక్ తోనే చాలా బాగా మెప్పించారు.. రామ రావణ యుద్ధం ఏ రేంజ్ లో ఉండబోతుందో ట్రైలర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ రావడం ఖాయం అనిపించేలా…

మెప్పించిన ఆదిపురుష్ ట్రైలర్ కచ్చితంగా సినిమా కూడా ఇదే విధంగా మెప్పిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే సత్తా ఉన్నా మూవీగా చెప్పుకోవచ్చు… సినిమా ఊపు చూస్తుంటే ఇదే నిజం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) ఏ రేంజ్ లో ఊచకోత కోస్తాడో చూడాలి.

2 COMMENTS

Leave a Reply to Yerpula Mary Cancel reply

Please enter your comment!
Please enter your name here