అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా సినిమా ఏ దశలో కూడా టార్గెట్ కి న్యాయం చేసేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో మొదటి వారాన్ని అతి కష్టం మీద పూర్తీ చేసుకున్న ఏజెంట్ మూవీ టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
6.60 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా రెండో వీక్ లో కొత్త సినిమాల రిలీజ్ లు ఉండటంతో థియేటర్స్ ని అన్నీ కోల్పోయిన సినిమా 100 లోపే థియేటర్స్ ని రెండో వారంలో కొనసాగించగా ఆ థియేటర్స్ లో కూడా కలెక్షన్స్ ని మినిమమ్ కూడా సొంతం చేసుకోలేక పోయిన సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో పట్టుమని 10 లక్షల రేంజ్ లో కూడా షేర్ ని సొంతం చేసుకోలేక పోయింది ఇప్పుడు. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన అతి కొద్ది సినిమాల్లో ఇప్పుడు ఏజెంట్ మూవీ కూడా ఒకటిగా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు.
ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా 6.7 కోట్ల రేంజ్ లో షేర్ ని 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 37 కోట్ల టార్గెట్ లో సినిమా ఇంకా 30.30 కోట్ల దూరంలో ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో షేర్ ని అందుకునే అవకాశం లేదు కాబట్టి ఇక సినిమా భారీ నష్టాలతో పరుగును పూర్తీ చేసుకోబోతుంది…