అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత రెండో రోజు లో ఎంటర్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
కొన్ని సెంటర్స్ లో డ్రాప్స్ ఆల్ మోస్ట్ 80% రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు. విరూపాక్ష మరియు పొన్నియన్ సెల్వన్ 2 సినిమాల జోరు ముందు ఏజెంట్ మూవీ ఏమాత్రం హోల్డ్ ని చూపించడం లేదు ఇప్పుడు. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా 2వ రోజు కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది ఇప్పుడు. వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి కానీ దానికి చాలా తక్కువ అవకాశమే ఉంది. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటాయో చూడాలి.