బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన తర్వాత కొంచం ఎర్లీగా డిజిటల్ లో రిలీజ్ లు చేయడం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఆడియన్స్ ను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయిన సినిమా మొత్తం మీద ఓవరాల్ గా బడ్జెట్ దృశ్యా చూసుకుంటే 80 కోట్లకు గాను మినిమమ్ రికవరీని కూడా చూపించలేక పోయింది ఇప్పుడు. ఇక మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకున్నా…
కూడా అందులో 30 కోట్లకు పైగా రికవరీ ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్ ఎపిక్ డిసాస్టర్ గా నిలవబోతుంది. ఇక ఇలాంటి పరిస్థితిలో నష్టాలను కొంచం తగ్గించడానికి సినిమాను ఎర్లీ గా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 3 వారాలకు ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా ఈ నెల 19న ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కాబోతుంది. సినిమా సోనీ లివ్ యాప్ లో 19న డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.