బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ రన్ ని చాలా త్వరగా పూర్తీ చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. బడ్జెట్ దృశ్యా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా…
ఈ సినిమా నిలిచింది అని చెప్పాలి. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ముందు అనుకున్న బడ్జెట్ కి మించి బడ్జెట్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ దశలో కూడా మెప్పించలేక పోయింది. దాంతో వీకెండ్ కే చేతులు ఎత్తేసిన ఈ సినిమా విషయంలో అంచనాలను అందుకోకపోవడంతో అందరికీ నిర్మాత క్షమాపణలు చెప్పగా…
ఇప్పుడు ఈ సినిమా ఫ్లాఫ్ పై అక్కినేని అఖిల్ కూడా స్పందించాడు… అఖిల్ మాట్లాడు…ఈ సినిమా కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ చాలా థాంక్స్ అని, సినిమా బాగుండటానికి మేం ఎంత చేయాలో అంత చేసినప్పటికీ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందని….కచ్చితంగా ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని చెప్పాడు అఖిల్.
నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీసిన నిర్మాతకి, నన్ను నమ్మి సినిమాను కొన్న బయ్యర్స్ కి థాంక్స్ చెప్పిన అఖిల్ అభిమానులకు కచ్చితంగా ఓ భారీ కంబ్యాక్ ఇస్తానని మాట ఇచ్చాడు. మరి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ లతో కచ్చితంగా ఓ భారీ బ్లాక్ బస్టర్ తనకి సొంతం అవ్వాలని మనమూ కోరుకుందాం.