బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఆడియన్స్ ను అలరించడంలో భారీగా విఫలం అయిన విషయం తెలిసిందే. సినిమా కలెక్షన్స్ చూసి టోటల్ ఇండస్ట్రీ కూడా షాక్ అవ్వగా వీకెండ్ లోనే సినిమా ఫేట్ డిసాస్టర్ అని డిసైడ్ అయిపొయింది ఇప్పుడు…
ఒక పక్క సోషల్ మీడియాలో సినిమా పై వస్తున్న రెస్పాన్స్ చూసి కామన్ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తూ ఉండగా సినిమా గురించి ఇప్పుడు ఏకంగా నిర్మాతనే స్పందించాడు… రిలీజ్ కి ముందు సినిమాను ప్రమోట్ చేయడానికి కొంచం ఎక్కువే మాట్లాడినా కానీ…
బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమాను స్టార్ట్ చేయడం నుండి అన్నీ అనుకున్నట్లు జరగలేదని, అలాగే కోవిడ్ వలన కూడా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వచ్చిందని చెబుతూ ఇప్పుడు ఎన్ని చెప్పినా రిజల్ట్ ను మార్చలేం కాబట్టి ఈ సినిమా నుండి కొన్ని పాఠాలు నేర్చుకుని తర్వాత సినిమాల విషయంలో…
వీటిని కచ్చితంగా పాటిస్తామని చెప్పుకొచ్చాడు నిర్మాత అనిల్ సుంకర… ఇలా సినిమా రిలీజ్ అయిన 4 వ రోజునే రిజల్ట్ ను ఒప్పుకుని ఇలా ఓపెన్ గా సినిమా పై కామెంట్ చేయాలి అంటే చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది. ఆ విషయంలో నిర్మాతను మెచ్చుకుని తీరాల్సిందే కానీ అదే టైంలో బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయడం, ఓవర్ బడ్జెట్ ఇలాంటి విషయాల్లో నిర్మాత స్ట్రిక్ట్ గా ఉండి ఉంటే కొంచం బెటర్ ఔట్ పుట్ వచ్చి ఉండేదని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.