మగధీర సినిమా తో విలన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి అనేక సినిమాల్లో విలన్ రోల్స్ చేసి మంచి పేరును సొంతం చేసుకున్న దేవ్ గిల్ ఇప్పుడు హీరోగా మారి చేసిన ప్రయత్నమే అహో విక్రమార్క(Aho Vikramarka Movie Review) సినిమా….ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే కరప్ట్ పోలిస్ ఆఫీసర్ అయిన హీరో పార్వతి స్లం అనే ఏరియాకి వస్తాడు, కానీ అక్కడ బలంగా ఉన్న జనాలను మరో ప్రాంతంలో పనికి విలన్ గ్యాంగ్ తీసుకు వెళతారు, కానీ వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు…కరప్ట్ పోలిస్ ఆఫీసర్ అయిన హీరో ఈ విషయం తెలిసి ఏం చేశాడు…తను మారాడా లేదా అన్నది అసలు కథ…
చాలా చాలా బేసిక్ కథ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి 5 నిమిషాలకే పరమ రొటీన్ కథ అని తేలిపోతుంది. తర్వాత అదే రొటీన్ సీన్స్ తో సాగిన సినిమా అక్కడక్కడా హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ఫైట్ సీన్స్ మినహా ఏ దశలో కూడా మినిమమ్ ఆసక్తిని కూడా క్రియేట్ చేయలేదు..
నెగటివ్ షేడ్స్ నుండి పాజిటివ్ షేడ్స్ లోకి మారే పాత్రలో నటించిన దేవ్ గిల్ పర్వాలేదు అనిపించినా తనని ఒక రకమైన పాత్రల్లో చూసి చూసి ఇలా పాజిటివ్ రోల్ లో చూడటం కొంచం కష్టంగానే అనిపించినా తనవరకు పర్వాలేదు అనిపించాడు…మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా…
మొదటి 5 నిమిషాలకే సినిమా పరిస్థితి అర్ధం అవ్వగా తర్వాత ఏ దశలో కూడా తేరుకోలేక పోయిన సినిమా సహనానికి పరీక్ష పెడుతుంది… కొన్ని యాక్షన్ సీన్స్ మినహా సినిమాలో చెప్పడానికి కూడా ఏమి లేదు…హీరోగా దేవ్ గిల్ ప్రయత్నం బాగున్నా సినిమా పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా…