నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు, ఇది వరకు వీళ్ళ కాంబోలో వచ్చిన సింహా లెజెండ్ లాంటి సినిమాలు ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబోలో వస్తున్న మూడో సినిమా అఖండ ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రాబోతుండగా సినిమా సెన్సార్ పనులను రీసెంట్ గా కంప్లీట్ చేసుకుని…
U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా రన్ టైం 2 గంటల 47 నిమిషాల భారీ లెంత్ తోనే సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక సెన్సార్ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ ఏంటి అనేది కూడా ఆల్ మోస్ట్ బయటికి రాగా ఇనీషియల్ టాక్ సూపర్ పాజిటివ్ గానే…
ఉందనిపించింది… విలేజ్ బ్యాగ్ డ్రాప్ తో సినిమా ఓపెన్ అయ్యి ఒక బాలకృష్ణ చుట్టూ విలేజ్ లో కథ నడుస్తుందని తర్వాత దేవాలయాల కూల్చివేత చుట్టూ అఘోరా అయిన అఖండ కథ సీన్ లోకి వస్తుందని అంటున్నారు. ఫస్టాఫ్ టేక్ ఆఫ్ సాలిడ్ గా అయ్యి…
ఇంటర్వల్ వరకు కథ బాగుంది అనిపించే రన్ అవుతూ అల్టిమేట్ ఇంటర్వెల్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి సెకెండ్ ఆఫ్ అఖండ అల్టిమేట్ కథ కంప్లీట్ గూస్ బంప్స్ స్టఫ్ తో నిండిపోతుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా సింహా లెజెండ్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉంటుందని, ఆ రెండు సినిమాల్లో ఫస్టాఫ్ సెకెండ్ ఆఫ్ తో పోల్చితే…
కొంచం వీక్ గా ఉంటుందని కానీ ఇక్కడ ఫస్టాఫ్ ని కూడా బాగా డీల్ చేశారని అంటున్నారు. ఫైనల్ గా సినిమా కి సెన్సార్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో టాక్ ఉందని చెప్పాలి… కథ పాయింట్ సింపుల్ గానే ఉన్నప్పటికీ బ్యాగ్ డ్రాప్ కంప్లీట్ గా ఆడియన్స్ కోరుకునే అంశాలను అద్బుతంగా తీర్చిదిద్ది మెప్పిస్తుందని చెబుతున్నారు. ఇదే రేంజ్ టాక్ రిలీజ్ అయ్యాక సొంతం అయితే బాక్స్ ఆఫీస్ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.