అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అఖిల్ కి సాలిడ్ హిట్ దక్కేలా చేసింది. సినిమా పోటి లో కూడా మరీ అద్బుతమైన టాక్ ఏమి సొంతం కాకున్నా కానీ ఉన్నంతలో మంచి వసూళ్ళని సొంతం చేసుకుని కెరీర్ ఫస్ట్ హిట్ గా నిలిచింది.
అఖిల్ అక్కినేని కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ సినిమా కే హ్యుమంగస్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు, అఖిల్ ది పవర్ ఆఫ్ జువా సినిమా అల్టిమేట్ బజ్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే నే అప్పట్లో స్టార్ హీరోల సినిమాల రేంజ్ ఓపెనింగ్స్ ని…
అందుకుని సంచలనం సృష్టించినా సినిమా కి డిసాస్టర్ టాక్ రావడంతో తేరుకోలేక పోయింది. తర్వాత అఖిల్ చేసిన సినిమాలు హలో మరియు మిస్టర్ మజ్ను రెండూ కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. అఖిల్ మొత్తం మీద ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
అఖిల్ ది పవర్ ఆఫ్ జువా టోటల్ రన్ లో 19.85 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, ఇక తర్వాత చేసిన హలో సినిమా 19.60 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక మిస్టర్ మజ్ను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 12.10 కోట్ల షేర్ తో డిసాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టోటల్ రన్ లో…
24.14 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 సినిమాల కలెక్షన్స్ కలిపితే 75.69 కోట్ల షేర్ ని అందుకున్నాడు అఖిల్…. యావరేజ్ గా ఒక సినిమా కలెక్షన్స్ 18.9 కోట్ల రేంజ్ లో వస్తున్నాయి ప్రస్తుతానికి… ఇతర హీరోలతో పోల్చితే ఈ స్పీడ్ ఇంకా పెంచి భారీ మార్జిన్ తో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఏజెంట్ సినిమా ఈ కోరిక తీర్చి అఖిల్ కి తిరుగు లేని బ్లాక్ బస్టర్ గా నిలిస్తుందేమో చూడాలి.