Home న్యూస్ అక్షరాలా 261 కోట్లు…2021 నంబర్ 1 రికార్డ్ ఇది!!

అక్షరాలా 261 కోట్లు…2021 నంబర్ 1 రికార్డ్ ఇది!!

1203
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత వరుస పరాభవాలు, OTT రిలీజ్ ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ నికార్సయిన హిట్ కొట్టి ఇండియాలో నంబర్ 1 గా తిరిగి నిలిచింది, మినిమమ్ కలెక్షన్స్ వస్తేనే చాలు అనుకున్న టైం లో ఏకంగా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సూర్యవంశీ లాంగ్ రన్ లో కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది.

సినిమా రిలీజ్ అయిన 15 రోజులకు టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ లెక్క 261 కోట్ల మార్క్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా 15 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 165 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ ఇండియన్ గ్రాస్…

210 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా 15 రోజుల్లో 261 కోట్ల గ్రాస్ తో నిలిచి 2021 ఇయర్ లో మాస్టర్ సినిమా కలెక్షన్స్ 236 కోట్ల మార్క్ ని అధిగమించి ఇప్పుడు నంబర్ 1 గా నిలిచింది, లాంగ్ రన్ లో 300 కోట్ల మార్క్ ని ఈ సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here