ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు. బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ సినిమా గ్రాండ్ ఓపెనింగ్స్ ని అందుకున్నా టాక్ నెగటివ్ గా ఉండటం తో డిసాస్టర్ అయింది, తర్వాత రీ లాంచ్ అంటూ చేసిన హలో అంచనాలను అసలు అందుకోలేదు, ఇక మూడో ప్రయత్నం గా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేసినా మిస్టర్ మజ్ను కూడా…
అంచనాలను అందుకోలేక తెలుగు లో డిసాస్టర్ అయ్యింది. కానీ ఇదే సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా హిందీ డబ్ అయ్యి సంచలన వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండగా మరో పక్క టెలివిజన్ లో రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి సాలిడ్ ఇంప్రెషన్స్ ని సాధించింది.
ముందుగా యూట్యూబ్ లో సినిమా ఇప్పటికే 75 మిలియన్స్ ని కంప్లీట్ చేసుకుని 100 మిలియన్స్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుండగా సినిమా కి ఇప్పటి వరకు ఏకంగా 1.2 మిలియన్స్ కి పైగా లైక్స్ దక్కడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా టెలివిజన్ లో గత వారం టెలికాస్ట్ చేశారు హిందీ లో..
అక్కడ కూడా సాలిడ్ గా ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకుని గత వారం ఇండియా లో టెలికాస్ట్ అయిన హిందీ మూవీస్ అన్నింటి లోకి అత్యధిక ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచి దుమ్ము లేపింది. ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు 67.7 లక్షల ఇంప్రెషన్స్ దక్కాయి.
దాంతో ఇక్కడ డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్నా కానీ హిందీ డబ్ వర్షన్ వరకు మాత్రం సినిమా సూపర్ హిట్ రిజల్ట్ ని అక్కడ సొంతం చేసుకోవడమే కాకుండా టెలివిజన్ లో కూడా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక తెలుగు లోనే అఖిల్ క్లీన్ హిట్ కొట్టాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో ఆ హిట్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి…