అక్కినేని అఖిల్ బాక్స్ అఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతుంది, ఈ 6 ఏళ్లలో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలను మాత్రమె రిలీజ్ చేసిన అఖిల్ మూడు సార్లు కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోవడం లో మాత్రం విఫలం అయ్యాడు. మొదటి సినిమా అఖిల్ హైప్ అల్టిమేట్ లెవల్ లో ఉండగా ఆ హైప్ ను సినిమా అందుకోలేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ….
డిసాస్టర్ మూవీ అఖిల్ ఖాతాలో పడగా తర్వాత హలో సినిమా తర్వాత చేసిన మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అంచనాలను అందుకోలేదు. ఇలాంటి టైములో బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిస్కీ సినిమాగా నిలిచినా… ఆడియన్స్ లో ఈ సినిమా తో కంబ్యాక్ చేస్తాడు…
అన్న అంచనాలు బాగానే ఉన్నాయి… ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఇప్పుడు సురేందర్ రెడ్డి తో చేస్తున్న ఏజెంట్ సినిమా మీద మాత్రం సూపర్ సాలిడ్ అంచనాలు ఉండగా ఈ సినిమా తర్వాత సినిమాను కూడా అఖిల్ కమిట్ అయ్యాడు అంటూ టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి అని చెప్పాలి.
ఆ వార్తల ప్రకారం అఖిల్ కొత్త సినిమా రీసెంట్ టైం లో బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ ని తీసిన దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అందాల రాక్షసితో టాలీవుడ్ లో అడుగు పెట్టి కృష్ణగాడి వీర ప్రేమగాదతో పర్వాలేదు అనిపించినా తర్వాత చేసిన లై కానీ పడి పడి లేచే మనసు సినిమాలు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించాయి అందరికీ…
ఆ సినిమాల తర్వాత సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హను రాఘవపూడి తను రాసుకున్న కథని అఖిల్ కి వినిపించడం అఖిల్ పాజిటివ్ గా స్పందించడం కూడా జరిగింది అంటూ టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఏజెంట్ తో ఇప్పుడు అంచనాలను భారీగా పెంచుతున్న అఖిల్ తర్వాత సినిమా మరింత టాప్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తే బెటర్ అని అందరూ అంటున్నారు. మరి అఖిల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.