Home న్యూస్ ఇక్కడ ఫ్లాఫ్…కానీ అక్కడ సూపర్ హిట్….2 రోజుల బుకింగ్స్ అన్నీ ఫుల్!!

ఇక్కడ ఫ్లాఫ్…కానీ అక్కడ సూపర్ హిట్….2 రోజుల బుకింగ్స్ అన్నీ ఫుల్!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి ఆడియన్స్ ముందుకు వచ్చిన లాస్ట్ మూవీ దర్బార్. లాస్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కోలివుడ్ లో అలాగే టాలీవుడ్ లో ఒకే టైం లో రిలీజ్ అవ్వగా కోలివుడ్ లో భారీ అంచనాల నడుమ సినిమా రిలీజ్ ను సొంతం చేసుకున్నా అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది. ఇక తెలుగు లో రజినీ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా నిరాశ పరచగా…

ఈ సినిమా కూడా రెండు సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీస్ మధ్యలో రిలీజ్ అవ్వడం తో అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలను గట్టిగానే మిగిలించింది అని చెప్పాలి. దాంతో మురగదాస్ కూడా రజినీ కి ఓ బ్లాక్ బస్టర్ ను ఇవ్వలేక పోయాడు…

అంటూ అందరూ కామెంట్స్ చేశారు అప్పట్లో… కానీ ఇప్పుడు ఇదే సినిమా మరో చోట అద్బుతమైన క్రేజ్ తో దూసుకు పోతుందని సమాచారం. సూపర్ స్టార్ రజినీకి ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో జపాన్ లో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ రజినీ మార్కెట్ ముత్తు సినిమా తో మొదలు అవ్వగా…

తర్వాత క్రమం తప్పకుండా రజినీ సినిమాలు అన్నీ కూడా అక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతూ వస్తుంది, ఇక్కడ రజినీ సినిమాలకు ఎలా రచ్చ చేస్తారో అక్కడ కూడా ఇదే రేంజ్ రచ్చ చేయడం కూడా కామన్ అయ్యింది. ఇక పాండమిక్ ఎంటర్ అవ్వడం తో లాస్ట్ ఇయరే అక్కడ రిలీజ్ అవ్వాల్సిన దర్బార్ సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వగా సినిమా రీసెంట్ గా అక్కడ రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి సినిమాకి…

అక్కడ సూపర్ హిట్ టాక్ సొంతం అయ్యిందని అంటున్నారు. అంతే కాదు జనాలు విరగబడి సినిమాను చూడటానికి థియేటర్స్ కి తరలివస్తున్నారని, అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల పాటు కూడా ఫుల్ అయ్యిపోయాయని అంటున్నారు. జపాన్ కరెన్సీ రేటు చాలా తక్కువ, కలెక్షన్స్ ఎంత వచ్చినా పెద్దగా రికార్డులు ఏమి రావు కానీ రజినీ ఈ ఏజ్ లో కూడా అక్కడ కూడా తన క్రేజ్ ని మెయిన్ టైన్ చేస్తూ ఉండటం నిజంగానే విశేషం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here