Home TRP రేటింగ్ అల వైకుంఠ పురం లో మలయాళం రికార్డ్ బ్రేకింగ్ “TRP రేటింగ్”

అల వైకుంఠ పురం లో మలయాళం రికార్డ్ బ్రేకింగ్ “TRP రేటింగ్”

0

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే, టాలీవుడ్ చరిత్ర లోనే సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ గా మారిన ఈ సినిమా మరో అద్బుతం సృష్టించింది.

సినిమా రీసెంట్ గా తెలుగు కన్నా ముందే మలయాళం డబ్ వర్షన్ టెలికాస్ట్ అయింది. కాగా అక్కడ టెలికాస్ట్ అయిన ఇతర భాషల డబ్బింగ్ మూవీస్ పరంగా సరికొత్త రికార్డ్ ను ఈ సినిమా సృష్టించింది అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది వరకు అక్కడ విజయ్ మూవీ తెరీ సినిమా 12 “TRP రేటింగ్” ని సొంతం చేసుకుంది అంటున్నారు కానీ పక్కా ఆధారాలు లేవు. కానీ ఈ సినిమా కి మాత్రం ఓవరాల్ గా 11.17 “TRP రేటింగ్” దక్కినట్లు సమాచారం. దాంతో డబ్బింగ్ మూవీస్ పరంగా ఈ సినిమా అక్కడ…

సరికొత్త సంచలన “TRP రేటింగ్” ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇది వరకు అల్లు అర్జున్ మూవీస్ లో సరైనోడు 7.6 అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా 6 “TRP రేటింగ్” ని సొంతం చేసుకోగా ఇప్పుడు అల వైకుంఠ పురంలో సినిమా కెరీర్ బెస్ట్ ని నమోదు చేసింది. ఇక తెలుగు లో టెలికాస్ట్ చేస్తే “TRP రేటింగ్” ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here