బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ళకి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇక డిఫెరెంట్ మూవీస్ నే చేస్తాను అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చినా వెంటనే భారీ బడ్జెట్ తో చేసిన రొటీన్ మూవీ అల్లుడు అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా సంక్రాంతి బరిలో ఎంటర్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది, ఇక సినిమా ఓపెనింగ్స్ పరంగా సంక్రాంతి మూవీస్ లో…
లీస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకోగా టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా రాలేదు, అయినా ఓపెనింగ్స్ మట్టుకు రాగా తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది, ఇక వర్కింగ్ డేస్ లో కంప్లీట్ స్లో అయిన సినిమా రెండో వారంలో మరింతగా తేలిపోయింది.
ఏమాత్రం గ్రోత్ లేకపోవడం తో కలెక్షన్స్ టార్గెట్ వైపు వెళ్ళనే లేదు, దాంతో టార్గెట్ కి దూరంగానే రెండు వారలను పూర్తీ చేసుకున్న సినిమా మొత్తం మీద 75% టార్గెట్ ని రికవరీ చేసి యావరేజ్ టాగ్ ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది అని చెప్పాలి.
బాక్స్ అఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా మొత్తం మీద 2 వారాల తర్వాత సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.21Cr
👉Ceeded: 1.42Cr
👉UA: 1.54Cr
👉East: 59L
👉West: 54L
👉Guntur: 58L
👉Krishna: 33L
👉Nellore: 27L
AP-TG Total:- 7.48CR (12.48Cr Gross~)
KA+ROI: 16L
OS: 5L
Total:- 7.69Cr(13.11Cr~ Gross)
ఇదీ మొత్తం మీద అల్లుడు అదుర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 2 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమాను టోటల్ గా 9.4 కోట్లకు అమ్మగా 9.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా ఇప్పుడు 2 వారాలు….
పూర్తీ అయ్యాక మరో 2.11 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది, అది దాదాపు అసాధ్యమే కాబట్టి ప్రస్తుతానికి యావరేజ్ గా పరుగును కొనసాగిస్తుంది. పండగ టైం లో సినిమా ఈ చిన్న టార్గెట్ ని అందుకోక పోవడం సాలిడ్ దెబ్బ అనే చెప్పాలి. నార్మల్ టైం లో రిలీజ్ అయ్యి ఉంటె సినిమా మరింత షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని అందుకుని ఉండేది…