బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని 2014 లో అల్లుడు శీను సినిమా తో మొదలు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొదటి క్లీన్ హిట్ సినిమాను 2019 లో తమిళ్ బ్లాక్ బస్టర్ రాక్షసన్ తెలుగు రీమేక్ రాక్షసుడు తో సొంతం చేసుకోగా తర్వాత వరుస పెట్టి కొత్త సినిమాలను చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ముందుగా ఆడియన్స్ ముందుకు అల్లుడు అదుర్స్ సినిమా తో రావడానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు వచ్చే ఇయర్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇది వరకు కందిరీగ మరియు రభస సినిమాలు తీయగా….
రభస డిసాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా అనఫీషియల్ గా డైరెక్టర్ మొదటి సినిమా కందిరీగ కి సీక్వెల్ అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ లో. ఈ డైరెక్టర్ కందిరీగ సీక్వెల్ ని ఇది వరకే ప్లాన్ చేసి రామ్ కి వినిపించినా ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదు.
ఆ కథనే మళ్ళీ కొన్ని మార్పులతో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ గా తెరకేక్కిస్తున్నాడు అని గట్టి టాక్ ఉంది ఇండస్ట్రీలో, దానికి కారణం సినిమాలో కాస్ట్ అండ్ క్రూ మొత్తం హీరోయిన్స్ అలాగే జయప్రకాష్ మరి కొన్ని పాత్రలు మినహా అన్నీ కూడా కందిరీగ పాత్రలే ఇందులో కూడా ఉండబోతున్నాయి అని అంటున్నారు. ఇక్కడ కూడా …
2 ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒకరు సొనూ సూద్ కి జోడిగా ఉండబోతున్నారు అని అంటున్నారు. మరో న్యూస్ ఏంటి అంటే, కందిరీగ లో రెండు జంటలకు పెళ్ళిళ్ళు అయినట్లు చూపిస్తారు… రెండు జంటల పెళ్ళిళ్ళు పూర్తీ అయిన తర్వాత చేసే కామెడీనే ఈ అల్లుడు అదుర్స్ అంటున్నారు ఇప్పుడు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా ఈ సినిమా తో మరో హిట్ బెల్లంకొండ కి దక్కడం ఖాయం అన్న టాక్ కూడా ఉంది…