Home న్యూస్ అమర్ అక్బర్ ఆంటోని టోటల్ బిజినెస్…గట్టిగా కొట్టాలి మాస్ రాజా

అమర్ అక్బర్ ఆంటోని టోటల్ బిజినెస్…గట్టిగా కొట్టాలి మాస్ రాజా

0

  మాస్ మహారాజ్ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని…. ఇటు రవితేజ అటు శ్రీను వైట్ల వరుస పరాజయాలను రీసెంట్ గా సొంతం చేసుకున్నా వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో అమర్ అక్బర్ ఆంటోని సినిమా కి అన్నీ చోట్లా మంచి బిజినెస్ సొంతం అయింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ బిజినెస్ ని పరిశీలిస్తే…

నైజాం లో 9 కోట్లు, ఆంధ్రా లో 9 కోట్లు, సీడెడ్ లో 4 కోట్ల బిజినెస్ తో టోటల్ గా రెండు రాష్ట్రాలలో 22 కోట్ల బిజినెస్ ని సినిమా సొంతం చేసుకుంది. దాంతో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమా మినిమమ్ 23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది..

ఇక కర్నాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 2.5 కోట్ల బిజినెస్ తో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 27 కోట్లు అయింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. వరుస ఫ్లాఫుల్లో ఉన్న రవితేజ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here