Home న్యూస్ అమిగోస్ మూవీ రివ్యూ….రేటింగ్!!

అమిగోస్ మూవీ రివ్యూ….రేటింగ్!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకుంది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అయినా కానీ సినిమా పై అనుకున్న రేంజ్ లో అంచనాలు ఏర్పడలేదు. దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. ఫ్యామిలీతో హ్యాప్పిగా ఉండే హీరోకి తనలానే ఉండే మరికొందరిని కలుసుకునే వెబ్ సైట్ కనిపిస్తుంది..అందులో రిజిస్టర్ అయ్యి తన లాంటి వాళ్ళని కలుసుకోవడానికి వెళతాడు హీరో, తనలా ఉన్న ఇద్దరినీ మీట్ అవ్వగా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళలో ఒకరు మోస్ట్ వాంటెడ్ అని తెలుస్తుంది…

తర్వాత ఏం జరిగింది…. హీరో ఎలా ఈ సమస్య నుండి బయట పడ్డాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకునే కళ్యాణ్ రామ్ ఈ సారి…మరో డిఫెరెంట్ స్టొరీతో వచ్చాడు….ట్రిపుల్ రోల్ అంటే చాలా సినిమాల్లో అన్నదమ్ములుగానే చూపిస్తారు కానీ ఇక్కడ కాన్సెప్ట్ వేరుగా ఉండగా మూడు రోల్స్ లో కళ్యాణ్ రామ్ అద్బుతంగా నటించి మెప్పించాడు, ముఖ్యంగా విలనిష్ టచ్ ఉన్న రోల్ లో క్రూయల్ గా నటించాడు, హీరోయిన్ జస్ట్ ఓకే, బ్రహ్మాజీ కామెడీ ఒక సీన్ పర్వాలేదు మిగిలిన యాక్టర్స్ కూడా పర్వాలేదు… సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో చాలా నీరసంగా ఉంటుంది….

సెకెండ్ ఆఫ్ లో బాగానే టేక్ ఆఫ్ అయ్యి ఇంప్రెస్ చేసినా మళ్ళీ క్లైమాక్స్ లెంత్ మరీ ఎక్కువ అవ్వడంతో స్లో అయిన ఫీల్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఒకే…3 రోల్స్ ఒకే స్క్రీన్ పై ఉన్నప్పుడు స్క్రీన్ ఎఫెక్ట్ క్లియర్ గా తెలుస్తుంది. ఇక డైరెక్టర్ ఎంచుకున్న స్టొరీ పాయింట్ యూనిక్ గా డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ ఎక్స్ పీరియన్స్ లేక పోవడంతో సరిగ్గా హ్యాండిల్ చేయలేక పోయాడు… ఫస్టాఫ్ కథ టేక్ ఆఫ్ కి చాలా టైం తీసుకోగా ప్రీ ఇంటర్వెల్ నుండి…సెకెండ్ ఆఫ్ లో లాస్ట్ 30 నిమిషాల ముందు వరకు కూడా….

కథని బాగానే నడిపించగా క్లైమాక్స్ ఎపిసోడ్ లెంత్ పెరిగినట్లు అనిపించగా క్లైమాక్స్ లో సీక్వెల్ ట్విస్ట్ ఇచ్చారు… డైరెక్టర్ కోర్ పాయింట్ ని బాగా రాసుకున్నా కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం చిన్న మైనస్ పాయింట్… మొత్తం మీద కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ కోసం, సెకెండ్ ఆఫ్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి సినిమాను ఈజీగా చూడొచ్చు… మొత్తం మీద సినిమాలో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్, సెకెండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, సినిమా కోర్ స్టొరీ పాయింట్స్ లాంటివి హైలెట్స్ గా చెప్పుకోవచ్చు….

ఇక ఫస్టాఫ్, లవ్ స్టొరీ పెద్దగా వర్కౌట్ కాక పోవడం, స్టొరీ మొత్తం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్…. సినిమా లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా ఓవరాల్ గా సినిమా మొత్తం చూడాలి అంటే కొంచం ఓపిక అవసరం, డిఫెరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి కథ ప్రిడిక్ట్ చేసేలా ఉన్నా ఒకసారి చూసేలా అనిపిస్తుంది…ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కూడా సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి చూడొచ్చు…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here