Home న్యూస్ అంతరిక్షం ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

అంతరిక్షం ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

   రెండు బాక్ టు బాక్ హిట్స్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసింది. ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షో లని పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి లభిస్తుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ విషయానికి వస్తే అనుకోకుండా ఒక శాటిలైట్ లాంచ్ లో వచ్చిన తప్పులను హీరో ఎలా సరిదిద్దాడు అన్నది కాన్సెప్ట్ అంటున్నారు.

ముందుగా ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకుని తెరకెక్కించినందుకు దర్శకుడు సంకల్ప్ కి శెభాష్ చెప్పాల్సిందే అంటున్నారు. కథ విషయం లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఇలాంటి ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ కి…

కావాల్సిన పకబ్దండీ స్క్రీన్ ప్లే ఈ సినిమా విషయం లో కొంచం తేలిపోయిందని అంటున్నారు. మెయిన్ పాయింట్ లో కి రావడానికి కొంత టైం తీసుకోగా మళ్ళీ హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం తర్వాత సెకెండ్ ఆఫ్ లో స్క్రీన్ లో ఈజీగా..

చెప్పే విధంగా ఉండటం మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. కానీ విజువల్స్ అద్బుతంగా ఉండటం స్క్రీన్ ప్లే గెస్ చేసే విధంగా ఉన్నా ఆ సీన్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఓవరాల్ గా నచ్చుతుందని అంటున్నారు.

వరుణ్ తేజ్ తొలిప్రేమ సెకెండ్ ఆఫ్ క్యారెక్టర్ ని ఇక్కడ కూడా క్యారీ చేసినట్లు అనిపించిందని, హీరోయిన్స్ ఇద్దరికీ నటించడానికి స్కోప్ తక్కువే అని అంటున్నారు. ఓవరాల్ గా ఇది సాంకేతక వర్గం ఎక్కువ స్కోర్ చేసే సినిమా అని అంటున్నారు.

దర్శకుడు మిగిలిన సాంకేతిక వర్గం పూర్తిగా సక్సెస్ కాకున్నా పాస్ మార్కులు మించేశారని అంటున్నారు. ఓవరాల్ గా అంతరిక్షం ఓవర్సీస్ ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇక ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here