Home న్యూస్ యాంట్ మాన్ అండ్ ది వాస్ప్…క్వాంటమేనియా రివ్యూ…ఏంటి సామి ఇదీ!!

యాంట్ మాన్ అండ్ ది వాస్ప్…క్వాంటమేనియా రివ్యూ…ఏంటి సామి ఇదీ!!

0

మార్వెల్ సిరీస్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక్క స్పైడర్ మాన్ నో వే హోమ్ సినిమా మాత్రమే అంచనాలను అందుకుని భారీ వసూళ్ళని సాధించింది, ఆ సినిమా తప్పితే మిగిలిన ఏ సినిమాలు అంచనాలను అందుకోలేదు కానీ ఉన్నంతలో మార్వేల్ లవర్స్ కి పర్వాలేదు అనిపించాయి, మార్వేల్ ఫ్రాంచేజ్ లో ఫేస్ 5 స్టార్ట్ ని యాంట్ మాన్ అండ్ ది వాస్ప్…క్వాంటమేనియా తో స్టార్ట్ చేశారు…

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు అయితే పెరిగి పోగా ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఎలా అనిపించింది అంటే మాత్రం యావరేజ్ రేంజ్ లో అనిపించింది అని చెప్పాలి… స్టొరీ పాయింట్ కి వస్తే….యాంట్ మాన్ కూతురు క్వాంటమేనియాకి ఒక పోర్టల్ ఓపెన్ చేయగా హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీ అందులో ఇరుక్కుంటారు… అక్కడ వాళ్ళు థానోస్ ని కూడా….

మించిన విలన్ అంటూ చెప్పిన విలన్ కాంగ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఇరుక్కుపోయిన విలన్ హీరో సాయంతో బయటపడాలని చూస్తాడు. మరి హీరో ఏం చేశాడు అన్నది సినిమా కథ… ఓవరాల్ గా కథ పాయింట్ వీక్ గా ఉండగా గ్రాఫిక్స్ మాత్రం బాగున్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా 3D ఎఫెక్ట్ సినిమాలో లేదు… 

సినిమా చూడాలి అనుకున్న ఆడియన్స్ 2D లో చూస్తె కొన్ని డబ్బులు మిగులుతాయి… ఇక సినిమా కంటెంట్ కూడా వీక్ గానే ఉండగా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ తర్వాత సినిమాల పై మాత్రం ఆసక్తిని పెంచాయి అని చెప్పాలి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వేల్ నుండి వస్తున్న సినిమాలు క్వాలిటీ పరంగా ఇంకా ఇంప్రూవ్ అయినా…

కంటెంట్ మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయడం లేదు, అవెంజర్స్ ఎండ్ గేమ్ కన్నా ముందు సోలో హీరోల సినిమాలు కంటెంట్ పరంగా కూడా అద్బతాలు సృష్టించాయి కానీ ఈ మధ్య కంటెంట్ పెద్దగా ఇంప్రెస్ చేయడం లేదు, కానీ అప్ కమింగ్ బిగ్ మూవీస్ కి ఇవి అన్ని సెటప్ కాబట్టి ఈ సినిమాలను ఒకసారి అలా టైం పాస్ కోసం చూడొచ్చు…. యాంట్ మాన్ అండ్ ది వాస్ప్…క్వాంటమేనియా కూడా అంతే…. ఎదో అద్బుతం చూడబోతున్నాం అని వెళితే నిరాశ తప్పదు… సో అంచనాలను తగ్గించుకుని వెళితే యావరేజ్ గా అనిపిస్తుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here