టాలీవుడ్ లో యంగ్ హీరోలలో స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయంలో మంచి కథలను ఎంచుకునే వాళ్ళలో ఒకరిగా యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth) కి మంచి పేరు ఉంది…తను నటించిన లేటెస్ట్ మూవీ అయిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo Review) ఆడియన్స్ ముందుకు ఎప్పుడో రావాల్సింది కానీ సడెన్ గా రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకుంది…
మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే లండన్ లో కార్ రేసింగ్ చేసే హీరో లైఫ్ లోకి హీరోయిన్ రుక్మిణి వస్తుంది….ఇక తన లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఎంట్రీ ఇస్తుంది…
అక్కడ మొదలైన కన్ఫ్యూజన్ లో ఒక మర్డర్ మిస్టరీ కూడా తోడు అవుతుంది..మరి ఇలాంటి పరిస్థితులలో హీరో ఏం చేశాడు…ఎలా సమస్యలను సాల్వ్ చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. ముందుగా నిఖిల్ మొదటి నుండి ఈ సినిమాను…
పెద్దగా ప్రమోట్ చేయలేదు…అలాగే సినిమా ట్రైలర్ కూడా పెద్ద ఎక్సైటింగ్ గా ఏమి అనిపించలేదు…కానీ నిఖిల్ సుదీర్ వర్మల కాంబోలో మూవీ అవ్వడంతో సినిమా సర్ప్రైజ్ చేస్తుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు సినిమాలో…
కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా చాలా వరకు సినిమా స్లో నరేషన్ తో బోరింగ్ స్క్రీన్ ప్లే తో సహనానికి పరీక్ష పెడుతుంది…ఫస్టాఫ్ లోనే చేతులు ఎత్తేసే రేంజ్ పరిస్థితులు నెలకొనగా ఇంటర్వెల్ టైంలో ఒక చిన్న ట్విస్ట్ తో సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అయినా కూడా…
సెకెండ్ ఆఫ్ కూడా పెద్దగా మెప్పించలేదు కానీ ఫస్టాఫ్ తో పోల్చితే కొంచం బెటర్ అనిపించింది….నిఖిల్ తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించాడు. హీరోయిన్స్ ఇద్దరూ ఓకే అనిపించగా విలన్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు…. కొన్ని చోట్ల కామెడీ పర్వాలేదు అనిపించినా కూడా…
ఎక్కడా నిఖిల్ సుదీర్ వర్మల ప్రీవియస్ మూవీస్ రేంజ్ కి ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది ఈ సినిమా….సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ లేదు…ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉండగా సినిమాటోగ్రఫీ బాగానే ఆకట్టుకుంది.
సుదీర్ వర్మ కెరీర్ లో చేసిన సినిమాల్లో వీకేస్ట్ స్క్రిప్ట్ తో తీసిన సినిమాగా అనిపించింది ఈ సినిమా…మరీ లో ఎక్స్ పెర్టేషన్స్ ని పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళిన చాలా చాలా ఓపికతో చూస్తె తప్పితే సినిమా యావరేజ్ గా అనిపించడం కూడా కష్టమే… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…