యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత 2 వారాల్లో 95.1 కోట్ల షేర్ ని అందుకోగా మూడో వీకెండ్ స్లో గా మొదలు పెట్టినా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి వీకెండ్ లో జోరు చూపింది. 17 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 71.67 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 96.3 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజు ఆదివారం టోటల్ గా 1.03 కోట్ల షేర్ ని అందుకుంది.
ఆదివారం సినిమా జోరు అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో ఓవరాల్ గా కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. సినిమా 100 కోట్ల ఆశలను మళ్ళీ చిగురించేలా చేసింది. మొత్తం మీద సినిమాను రెండు రాష్ట్రాలలో 67 కోట్లకు అమ్మగా టోటల్ గా 18 రోజుల్లో సినిమా..
72.58 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమాను సుమారు 91 కోట్లకు అమ్మగా టోటల్ గా 18 రోజుల కలెక్షన్స్ 97.33 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 కోట్లకు పైగా ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలవడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam: 21.34Cr, Ceeded:17.27cr, UA: 8.42cr, West:4.7cr, East: 5.4cr, Guntur: 7.9cr, Krishna: 4.85cr, Nellore: 2.7cr, AP&TS Total Share:72.58cr..KA 10.05cr, ROI 2.8cr, USA 8.9cr, UAE-GCC: 1.3cr, Aus-NZ: 0.8cr ROW 0.9cr, Total 24.75cr, Total 18 Days Collections : 97.33cr…
100 కోట్ల రేసు ను సోమవారం నుండి మొదలు పెట్టబోతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మినిమమ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని 4 వ వీకెండ్ ముగిసే లోపు అందుకునే ఛాన్స్ పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.